పుట:PadabhamdhaParijathamu.djvu/385

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కడి_____కడి 359 కడి_____కడి

 • పరిహార మవుతుం దనీ అంటారు. వేంకటేశ. 44.

కడి గడి యగు.

 • ఆహార మగు.
 • "విడువక చేతిలో విష్ణు ప్రసాదము, గడి గడి యైనది కానీరు గాని." తాళ్ల. సం. 6. 10.

కడిగినముత్యంలాగా

 • నిర్మలంగా, పరిశుభ్రంగా.
 • "ఆ పిల్ల కేం? కడిగిన ముత్యంలా ఉంటుంది." వా.
 • చూ. పులుగడిగిన ముత్యము.

కడిగి (పెట్టి) న సాలగ్రామం లాగా

 • బోసిగా, ఏ నగా నాణ్యం లేకుండా.
 • "వా డెంత సంపాదిస్తే మాత్ర మేం? పెళ్లాం మాత్రం కడిగిన సాలగ్రామం లాగా ఉంటుంది." వా.

కడిగి పెట్టిన గంగాళంలాగా

 • సర్వశూన్యంగా.
 • "ఆవిడ కడిగి పెట్టిన గంగాళం లాగా ఉంది. ఒక సొత్తా? ఒక చీరా?" వా.

కడిగి పెట్టిన నిప్పు లాగా

 • నల్లగా, బొగ్గులాగా.
 • వ్యంగ్యంగా అనుమాట.
 • "ఆ పిల్ల కేం? కడిగిపెట్టిన నిప్పులాగా ఉంటుంది." వా.

కడిగి వదిలి పెట్టు

 • అవమానించు; ఎదుటివాని లోపా లన్నీ బయట పెట్టు.
 • "వా దీసారి కనబడనీ. కడిగి వదిలి పెడతాను. వాడు చేసిన వెధవపను లన్నీ నాకు తెలియనివా ఏమిటి?" వా.

కడిగొను

 • తిను.
 • "చిచ్చు కడిగొనగ వచ్చు నే?" భాగ. 8. 246.

కడిపెడు బిడ్డలు

 • అధికసంతానం.
 • "కాక యున్న మేము కడిపెడు బిడ్డల, వార మెట్లు బ్రతుకువార మనుజ" భోజ. 6. 144.
 • చూ. కడుపు నిండా పిల్లలు.

కడి మాడ సేయునట్టి

 • అమూల్య మయిన. భోజనవిషయంలోనే వాడుక. ఒకొక్కకడి (అన్నం ముద్ద) ఒక మాడ చేస్తుంది అనుట.
 • "అమృతోపమానంబు లైన యన్నంబులు, కడి మాడ సేయంగ గుడుచువారు." విక్ర. 5. 124.

కడియపు చేమీదుగా దివముచేరు

 • ముత్తైదువ చావు చచ్చు. కడియములు సౌభాగ్య చిహ్నములుగా ఇక్కడ భావింపబడినవ్వి. వాడుకలో కూడ నేడు 'ఆమె ముత్తైదువ చావు చచ్చింది. ముత్తైదువగా పోయింది' మొదలైన పలుకుబడు లున్నవి. అయిదువగా స్త్రీ చనిపోవుట