పుట:PadabhamdhaParijathamu.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అండ________అంత 12 అంత________అంత

అండజశయ్య

  • హంసతూలికాతల్పము.
  • భార. సభా.

అండబ్రతుకు

  • ఎవరిపైనో ఆధారపడిన బ్రతుకు.
  • "వానిది ఒట్టి అండబ్రతుకు. సొంతంగా జీవించ లేడు." వా.

అండబాయు

  • ఎడబాయు.
  • "ఆరామయండ బాయక... యారాజవరుండు నిజపురాంత:పురముం జేరి..." శుక. 1. అ. 489 ప.

అండా ఆపూ

  • సహాయము.
  • "వాడికి అండా ఆపూ లేదు." వా.

అంతకంతకు

  • 1. క్రమక్రమంగా.
  • "అంతకంతకూ వాడి దౌర్జన్యం ఎక్కువై పోతూ ఉంది." వా.
  • చూ. అంతంతకు.
  • 2. రోజురోజుకూ
  • "అంతకంతకూ వాడు మితిమీఱి పోతున్నాడు." వా.

అంత కింతయింది ఇంత కెంతో?

  • ఇంకా యెన్ని కష్టాలు రా నున్నవో? ఇం కేమేమీ కా నున్నదో అనే భావచ్ఛాయలలో ఉపయోగించే పలుకుబడి.

అంతకూ ఇంతకూ

  • ప్రతి చిన్నదానికీ.
  • "అంతకూ యింతకూ వాడు నొచ్చుకుంటూ ఉంటాడు."
  • "అంతకూ యింతకూ ఆవిడ మాయింటికి పరుగెత్తుకొంటూ వస్తుంది."

అంతకు కడ కనుచు

  • చంపు.
  • "మహాస్త్రప్రకరం, బంతకుకడ కనిచెబరి, శ్రాంతం బగు మద్రనాథు రథిక చయంబున్."
  • భార. శల్య. 1. 300.

అంత చేసి ఇంత తెచ్చుకొను

  • అంత చేసి యింత ఫలితం తెచ్చుకొన్నావు - అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
  • "ఇంత దెచ్చికొంటి వంత సేసి."
  • భార. భీష్మ. 1. 67.

అంతంత

  • దూరదూరములోనే, క్రమముగా.
  • "నెచ్చెలిపిండు నంతంత నిలువ బలిచి."
  • భార. విరా. 1. 246.
  • "ఇంతయును నంత నంతంత పెఱిగి పొదరు, నిబ్బరపు గబ్బి గుబ్బల యుబ్బు కతన."
  • వసు. 2. 85.

అంతంతకు

  • క్రమంగా.
  • "అంతంతకూ ఈ వ్యవహారం ముదిరి పోతూ ఉంది." వా.

అంత పైపై పడి ఉన్నదా?

  • అంత సులభమా? కా దనుట.
  • "మహాకవితావివేచనా, భ్యాస మనంగ నంత బయిపై బడి యున్న దె?"
  • నానా. 25.