పుట:PadabhamdhaParijathamu.djvu/362

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కండ్ల____కంద 336 కంద____కందా

 • "ఏమిరా డబ్బేం చేశా వంటే కళ్లు తేలవేశాడు." వా.
 • "వాణ్ణి పట్టుకొని నాలుగు ఉతికేసరికి కండ్లు తేలవేశాడు." వా.
 • మూర్ఛ పోవునప్పుడు కండ్లు తేలిపోవుటపై వచ్చినపలుకుబడి.

కండ్లతో చూడ లేదు.

 • ప్రత్యక్షంగా చూడ లేదు.
 • "అందరూ అంటున్న మాటే నే నన్నాను. నే నయితే కండ్లతో చూడ లేదు." వా.
 • "అన్నెం పున్నెం దైవాని కెరుక. అందరూ అనడమే కానీ నే నైతే కండ్లతో చూడ లేదు." వా.

కండ్లతో చూడ లేము!

 • 1. అదేదో అతిమనోహరము.
 • "మైసూరు రాజభవనం దసరాలో విద్యుద్దీపాలతో ధగధగ మెరిసి పోతుంటుంది. ఆ వైభవం కండ్లతో చూడ లేము!"
 • 2. అదేదో అతిబాధాకరము.
 • "వాడు కడుపునొప్పితో పడేబాధ కంద్లతో చూడ లేము!" వా.

కండ్లలో కారం పోసుకొను

 • అసూయపడు.
 • "ఎవరు కాస్త పచ్చగా కనబడినా వాడు కండ్లల్లో కారం పోసుకుంటాడు." వా.

కండ్లలో వత్తులు వేసుకొని

 • చూ. కంట వత్తి నిడుకొని.

కందదుంపకు పానకము

 • వ్యర్థము. కందను పానకంలో నాన వేయడ మెందుకు! కుక్కు. 87.

కందనకాయ

 • గుండెకాయ
 • "సందియ మింత లేదు పెలుచన్ నును మొగ్గల మిట్టకోలలన్, గందనకాయ నేసె సుమకార్ముకు డే మని చెప్పువాడ." రాజశే. 3. 146.

కందవాఱు

 • కందిపోవు.
 • "లలితముక్తాహారగుళికాకలాపంబు, ఘ్రాణానిలంబున గందవాఱె." నైష. 2. 119.
 • రూ. కందపాఱు.

కందా కొట్టు

 • తిరిపపుతిండి మెక్కు.
 • వివరమునకు చూ. కందాలరాజు.

కందాలరాజు

 • సోమరి, తిండిపోతు; తిరిపెపు తిండి మెక్కువాడు.
 • కందా అనగా రాజబంధువుల భోజనశాల అని బ్రౌను, అక్కడ ఎవరైనా వచ్చి రాజబంధువు పేరుతో తిని తిరుగుతూ ఉండవచ్చును. అలా ఆ పేర తిని తిరుగు తిండిపోతునకు పే రై యేర్పడిన పలుకుబడి. నందక. 79 పు.