ఈ పుట ఆమోదించబడ్డది
ఒడ్డో_____ఒత్తి 312 ఒత్తి_____ఒత్తు
- "ఒడ్డు బొడ వగుగుబ్బ లరయుచు గానరాగా." తాళ్ల. సం. 4. 30.
- "అతను చాలా ఒడ్డుపొడ వైనమనిషి." వా.
ఒడ్డోలగం బై యుండు
- కొలువు తీరి యుండు, సభ చేరి యుండు.
- "బసవయ్య మొదలుగా భక్తులు దాను, నసమ మొడ్డోలగం బై యున్న యెడను." బస. 6. 169.
ఒడ్డోలగంగా
- కోలాహలంగా, మహావైభవంగా.
- "వాడి కూతురుపెళ్లి ఒడ్డోలగంగా జరిగింది." వా.
ఒడుదుడుకులుగా ఉండు
- హెచ్చుతగ్గులుగా ఉండు. సరిగా లేదు అనుపట్ల ఉపయోగిస్తారు.
- "ఈమధ్య వ్యాపారం అంతా ఒడుదుడుకులుగా ఉంది." వా.
- "రాజకీయరంగం నేడు చాలా ఒడుదుడుకులుగా ఉన్నది." వా.
ఒత్తి గొట్టాన పెట్టు
- బాధించు, వేధించు.
- "ఒత్తి గొట్టాన బెట్టగ బని లేదు ఓరి నీచిత్త మింతే కాని." తాళ్ల. సణ్. 12. 77.
ఒత్తి పండు చేయగలమా?
- బలవంతంతో పని కాదు. ఏదైనా కాయ దానంతట అది పరిపక్వం కావలసిందే కానీ ఒత్తి ఒత్తి మెత్త బరిస్తే అది పండు కాదు. క్రమపరిణతి అవసరము అనుట.
- "పలుకం బాఱని కాయల గొలుపం గల డెవడు పండ..." గువ్వలచెన్న. 12.
- "అదేమో బుద్ధి వచ్చినపిల్ల. వాణ్ణి చేసుకుంటే సుఖంగా ఉంటావే అని నెత్తిన నోరు పెట్టుకుని వాళ్లమ్మ చెప్తూంది. అయినా ఒత్తి పండు చేయగలమా? దానికి తెలియాలి గానీ." వా.
ఒత్తిలి చీరు
- గట్టిగా పిలుచు.
- "చెలికత్తె నొత్తిలి చీర లేనియెలుంగు, సింహనాదంబుచే జెదర కునికి." ఉ. హరి. 1. 161.
ఒత్తిలి పాడు
- నోరార పాడు.
- "వాసుదేవ యనుచు నొత్తిలి పాడు నాక్రోశించు నగు జింతనము సేయు నతి యొనర్చు." భాగ. స్క. 7. 240.
ఒత్తుకొని వచ్చు
- త్రోసుకొని వచ్చు.
- "ఒత్తుకొని వచ్చు కటి కుచోద్వృత్తి జూచి." కవిక. 3. 26.
- "ఎంతదూరం పోతున్నా అట్లా ఒత్తుకొని వస్తా వేం?' వా.
ఒత్తు దేరు
- ఒరసికొను; అందుతో ఉబ్బెక్కు.
- "ఉరుకుచాగ్రంబు లొండొంటి నొత్తు దేర." కుమా. 9. 143.