పుట:PadabhamdhaParijathamu.djvu/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏమొ____ఏయూ 289 ఏయూ___ఏరా

ఇప్పుడు పని పడిందని నే నే మొగంతో పోగలను?" వా.

  • "కాంతుం డెఱిగిన నాతని, పొంతకు నే మొగముతోడ బోయెదు చెపుమా." శుక. 2. 73.
  • "వాని నన్నిమాట లని ఏ మొగంతో తిరిగీ వానిదగ్గరకు వెడతావు?" వా.
  • చూ. మొగము చెల్లు, మొగము లేదు.

ఏ మొగము పెట్టుకొని...

  • "వాడి కన్ని కష్టాలు తెచ్చిపెట్టావు. ఇప్పుడు ఏ మొగం పెట్టుకొని పోయి వాణ్ణి సాయం చేయ మని అడుగుతావు." వా.
  • చూ. ఏ మొగముతో.

ఏ యూరి కే త్రోవ?

  • దానికీ దీనికీ సంబంధము లేదనుట.
  • త్రోవ కున్నపర్యాయపదాలన్నీ ఇక్కడ ఉపయుక్తమవుతాయి.
  • "తరుణీ సంగమ మెక్కడ?, యిరవగుయోగదశ యెక్క డేయూరికి నే, తెరువు జితేంద్రియు డగుదు, శ్చరితు నియోగంబు దంభసంజ్ఞను కాదే?" హరివంస. పూ. 40 పే.90.

ఏయూరి కేది తెరువు

  • రెంటికి సంబంధము లే దనుట. ఏ ఊరికి ఏది దారి అనడం వాడుక. పాండు. 4. 278.
  • రూ. ఏఊరికి ఏదారి.

(ఇది) ఏ యూరు? (అది) ఏ యూరు?

  • దానికీ దీనికీ సంబంధ మెక్కడిది అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "మత్తు లై వర్తిల్లుమానవేశ్వరులు సత్తుగా బొంకుట సత్య మెయ్యెడను, జనపతు లేయూరు సత్య మేయూరు? హరి. ద్వి. 1 భా. 160. పం.

ఏ యండ కా గొడుగు పట్టు

  • సమయానుకూలముగా ప్రవర్తించు. ఇది నిరసనలోనే ఉపయోగిస్తారు.
  • "కుడువం జొచ్చును బ్రాహ్మణార్థములు పెక్కుల్ రాజకీయార్థముల్, నడుపం జూచును యాజ్ఞ వల్క్యుండు ధరన్ నానోచ్చనీచంబులం, దెడ లేక న్నటి యించు గాలము కొలదిం బోవు నే యెండ కా, గొడుగుం బట్టు ధనార్జనంబునకు నెగ్గున్ మ్రొగ్గు త గ్గేమనున్." తెలుగునాడు. పే. 41.

ఏరాలు

  • సవతి; తోడికోడలు.
  • "మగువ యేరాలికి మసలె గర్భంబు." పండితా. ద్వితీ. మహి. పుట. 155.
  • కోశములలో తోడికోడ లనే ఉన్నది. కానీ పైన సవతేనని కథాసందర్భం సూచిస్తున్నది.
  • "ఏరాలిపట్టి బిట్టెత్తి చెక్కిలి నొవ్వ, గఱచి వా డేడ్చిన గౌగిలించు." పాండు. 3. 62.