పుట:PadabhamdhaParijathamu.djvu/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఏమి____ఏమి 288 ఏమి____ఏమొ

 • "జడనిధి చందంబున ని,మ్మడు వొప్పగ నిప్పుడేమి మాడెను నిమ్మై, నడచిపడ రిత్త నెవ్వగ, లుడుగుడు మఱి చూచుకొంద మొయ్యన తఱితోన్." భార. శాంతి. 3 ఆ.
 • చూ. ఏమి కొంప మునిగింది?

ఏమి మునిగి పోయినది?

 • ఏమి కొంప మునిగింది అనుట వంటిది.
 • "మునిగి పోయిన దేమి యిమ్ముగుద తల్లి...." పాణి. 3. 66.

ఏమి యిచ్చి యైన

 • ఎలాగో ఒక లాగ, ఏదో విధంగా ఏదోయిచ్చి.
 • "ఇది మఱువ జేయ దగు నేమి యిచ్చి యైన ననుచు..." కళా. 5. 138.

ఏమియు నెఱుగని

 • ఏమీ తెలియని, అమాయక మైన.
 • "ఇల్లాలు గడు సాధ్వి యేమియు నెఱుగదు." నైష. 1. 108.
 • "ఏమీ యెఱుగని పిల్ల పాపం! దాన్ని పట్టుకొని యేడిపిస్తా వేమిరా." వా.
 • దీనినే వ్యంగ్యంగా ప్రశ్నార్థకధ్వనితో అనుట వాడుకలో ఉన్నది.
 • "అవును! ఏమీ యెరుగదు పాపం! నంగనాచి." వా.

ఏమి లె క్కను

 • లెక్క లే దను.
 • "అదేమి లెక్కనున్." విజయ. 1. 102.

ఏమి వచ్చునో?

 • ఏమి కీడు మూడునో.
 • "...యిట్టు నట్టు పలుక నొప్ప కేమి వచ్చునో చనుడు." కళా. 3. 224.
 • "వాడు ఏమో ఎంత చెప్పినా వినకుండా ఆయన్నిగురించి ఏవేవో అన్నాడు. అది వెళ్లి వా డెవడో ముట్టించాడు. దీంతో ఏం వస్తుందో ఏమో అని భయంగా ఉంది." వా.

ఏమీ పట్టనట్లు

 • తన కేమీ ప్రమేయం లేనట్టు.
 • "వా డింటి పెద్దల్లుడు కదా. ఇంట్లో పెండ్లి జరుగుతూంటే తన కేమీ పట్టనట్లు పంచటరుగుమీద పడుకుని ఉంటా డేమిటి?" వా.

ఏమేమ అని

 • మేము మేము అని.
 • ఏ ఒకదానికో జనం ఎగబడినప్పుడు ఉపయోగించేపలుకుబడి. సంస్కృతంలో అహ మహమిక.
 • "మేము ముందు మేము ముందు అని జనం అక్కడికి ఎగబశ్శారు." వా.

ఏ మొగముతో....

 • ఎట్లు?
 • అనగా ఆ పని చేయుటకు ముఖము చెల్ల దనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
 • "అదె వచ్చె నిదె వచ్చె నని నా కెదురు చూచు, నీకు నీక్షింతు నే నేమొగమున." కాశీ. 5. 324.
 • "వాడు చెడి యింటికి వస్తే నిర్దాక్షిణ్యంగా ఆ నాడు పొమ్మన్నానా?