పుట:PadabhamdhaParijathamu.djvu/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడూ___ఏత 279 ఏత___ఏదీ

ఏడూడి

  • చనిపోయిన మొదటి సంవత్సరం పెట్టేతద్దినం. సాంవత్సరికం.

ఏడేడు పధ్నాలుగు లోకాలలో

  • సర్వప్రపంచంలో.
  • "ఏడేడు పధ్నాలుగు లోకాలలో వాణ్ణి తల దన్నేవాడు ఎవడూ లేడు." వా.
  • "ఏడేడు పధ్నాలుగు లోకాలు గాలించినా అంత రూపసి కనబడదు." వా.

ఏడ్పు ఎదురుచూచు

  • నిరాశావాది. ఏడుపుగుళ్ల వాడు అగు.
  • "వా డెప్పుడూ ఏడుపు ఎదురు చూస్తూ ఉంటాడు. నవ్వుతూ తుళ్లుతూ ఉండే వాళ్లంటే వాడికి పడదు." వా.

ఏడ్పుగొట్టు

  • ఎప్పుడూ యేడుస్తూ ఉండే వాడు.
  • సర్వదా అసంతృప్తుడు.
  • "పొద్దున్నే ఆ యేడుపుగొట్టు మొగం చూచాను. అన్నీ అడ్డంకులే." వా

ఏణ్ణూరు

  • ఏడువందలు.
  • పండితా. ప్రథ. దీక్షా. పుట. 236.

ఏతన్మాత్రములు

  • ఇంతవి.
  • "మెఱవకుండిన నేమి మెఱుగులపొలప మేం తన్మాత్రములె శాలిధళ ధళములు." పాండు. 4. 42.

ఏత మెత్తు

  • ఏతము త్రొక్కి పైరునకు నీరు పాఱించు.
  • "బ్రదుకాసం, దఱచుగ నేతా లెత్త గ, బఱిపఱి యై యతియు మల్లెపడి చెడిపోయెన్." కా. మా. 3. 152.

ఏతుల బోవు

  • హెచ్చులకు పోవు. గర్వపడు.
  • "చేతులు ద్రిప్పుచుం బ్రభుల చెంతల నూరక దుర్వినీతు లై, యేతుల బోవుచుం దిరుగు నిప్పటి మంత్రులు తంత్రు లిందఱన్." పాండు. 1. 73.

ఏతేరు

  • వచ్చు.
  • "ఎప్పటి మధుమాస మేతేరనృపుడు." రంగ. రా. బాల. పు. 15. పంక్తి. 18.

ఏ త్రోవ త్రొక్కవలయును ?

  • ఏమి చేయవలెను ? ఏ రీతిగా మెలగవలెను ?
  • "తన తప్పు దప్ప జిత్తిని, వనితా యేత్రోవ త్రొక్క వలయుం జెపుమా!" శుక. 2. 128.

ఏది దారి ?

  • దిక్కు లే దనుట.
  • "ఇస్తా మన్నవా ళ్లంతా ఎగరేశారు. రాత్రికి ఇంట్లో బియ్యపుగింజ లేదు. ఇం కేందారి రా భగవంతుడా!" వా.

ఏదీ లేక

  • అనుకొన్న వానిలో ఏ ఒక్కటీ లేక.
  • "వేవురి ముందర నాడుకొందు,