పుట:PadabhamdhaParijathamu.djvu/304

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఏడు____ఏడు 278 ఏడు____ఏడు

పాడెకు ఏడుకట్లు కడతారు. సవారీ అంటే వాహనం. తె. జా. ఏడుగడ

 • దిక్కు, రక్షకుడు. పరమ. 1. 91.
 • చూ. ఏడ్గడ.

ఏడుచు

 • బాధపడు, అంగలార్చు.
 • "ఏడు దినంబు లన్నమున కెడ్డము పుట్టిన యంత మాత్రలో, నేడుచుచున్న వాడవు." భీమ. 2. 116.
 • "పరీక్ష పోయిం దని ఏడుస్తా వేరా?" వా.

ఏడుచేట్లను చెఱుచు

 • అన్ని విధములా చెఱుచు.
 • "ఇదె మహీతల మెల్ల నేలునీరాజు, జెదరక యిట్లేడుచేట్లను జెఱచి, పోనీక బందెల బొరలించి తపసి, దానవుం డై నల్ల ద్రావుచున్నాడు." గౌర. హరి. ద్వి. 447-450
 • రూ. ఏడు చెఱువుల నీళ్లు త్రాగించు.

ఏడు నిలువుల మేడ

 • ఎత్తైన మేడ. ఎత్తును మనుష్య ప్రమాణంతో కొలవడంపై వచ్చినది. ఏడు నిలువు లెత్తన్న మాట. వాడుకలో నేటికీ ఉన్నది.
 • పండితా. ద్వితీ. మహి. పుట. 35.
 • "ఏడు నిలువులలో తున్న దాబావి." వా.

ఏడుపుమూతి పెట్టు

 • అసంతృప్తిని వ్యక్తము చేయు; అలుగు.
 • "వాణ్ణి ఒక్కమాట అంటే చాలు. ఏడుపుమూతి పెడతాడు." వా.

ఏడుపు వచ్చినంతపని అగు

 • కన్నీళ్ళపర్యంత మగు. దాదాపు ఏడ్చి వేసే ననుట.
 • " నే నామాట అనేసరికి వాడికి ఏడుపు వచ్చినంతపని అయింది." వా.
 • చూ. కన్నీళ్లపర్యంత మగు.

ఏడు మల్లెపూల చిన్నది

 • అతిసుకుమారురాలు. జానపద కథలలోనుంచి వచ్చినపలుకుబడి. ఆమె యేడుమల్లెపూల యెత్తు ఉన్నది. అనగా సుకుమారురాలు అనుట.
 • "అయ్యో నా బతుకా ! నా కోడలు పని చేసేట్టుంటే నాకీ అవస్థేమిటే కూతురా! అది ఏడు మల్లెపూల చిన్నదయి పోయెనే!" వా.

ఏడు మ్రొక్కులు మ్రొక్కు

 • అతిదీనతను కనపఱచు.
 • "అనఘ ఏడు మ్రొక్కు లా బృహస్పతికి మ్రొక్కెద." వా.
 • భార. అశ్వ. 1. 75.

ఏడులుపట్టు

 • చాలకాల మగు.
 • "ఇది పెక్కేడులు పట్టెన్, సదనంబులు గట్ట నాకు." కా. మా. 2. 100.
 • "అదంతా కావాలంటే ఏండ్లు పడుతుంది." వా.