పుట:PadabhamdhaParijathamu.djvu/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకు_____ఏట 275 ఏట_____ఏటి

ఏకులకు వాడి వెట్టు

  • శక్తిహీన మైనదానిని అతిశక్తివంత మని చెప్పు. ఏకులు అతి మెత్తనివి. వానికి పదును పెట్టడం ఎలాగూ సాధ్యం కాదు.
  • "నాకు లభీక దానవగణంబులతో సరిపోలువారె వీ, డేకుల వాడి వెట్టె దనయెద్దును దాను నిటుండి వీని ము,న్నేకత మంత మజ్జముని యింటికి నంచు...." కకు. 5. 45.

ఏ గాలికి ఆ చాప యెత్తు

  • సమయానుకూలముగా ప్రవర్తించు.
  • "ఏ గాలికి ఆ చాప యెత్తితే అందరూ బాగానే ఉండవచ్చు." వా.

ఏగుదెంచు

  • వచ్చు. పాండు. 1. 179.

ఏ చెట్ల గట్టితివి

  • వాణ్ణి ఎక్కడ వదిలివేశావు అను సందర్భంలో ఉపయోగించేపలుకుబడి.
  • వాడుకలో "వాణ్ణే చెట్టుకు కట్టేసి వచ్చవే?" అనగా దిగవిడిచితి వనుట.
  • "అతని నే చెట్ల గట్టితి నీత డెచ్చోట లంకించుకొనియె..." కళా. 3. 268.

ఏట పెంచువాని పూట పెంచు

  • అత్యాదరముతో పెంచు. ఏడాదిలో పెరగవలసినంత ఒక పూటలోనే పెరుగునట్లు చేయు.
  • "ఇట్లు తల్లి దండ్రు లెంతయు గారాన, నేట బెంచువాని బూట బెంచి..." సారం. 1. 52.

ఏటవేయు

  • భారము వేయు.
  • ఏట = బలిపిల్ల - మేక అనే అర్థం ఉంది. తద్వారా ఏట వేయు = బలియిచ్చు = మొక్కుబడి చెల్లించు తొలి అర్థం కావచ్చును. అర్థ మింకనూ విచార్యము.
  • "వేగి లేచి సంసారవిధులకే ఒడిగట్టి, యేగతి గొసరి న్నిపై నేట వేసేము." తాళ్ల. సం. 10. 2.

ఏటావలిగిలిగింతలు

  • అలభ్యములు. ఏటికి అటువే పున్న సంబరాలలో ఎలాగూ పాల్గొనడం అసంభవం. దాటరాని ఆటంకంగా ఏరు ఇక్కడ ప్రసక్తం.
  • "కలువలు కిలకిల నవ్వెన్, దొలిమల సెలయేటి యవలి తుహినాంశుకరం, బులు గని యిపు డేటావలి, గిలిగింత లటంచు వానికిన్ సరి దాకెన్." సారం. 2. 161.

ఏటికి ఎదురీదు

  • జనాభిప్రాయానికి వ్యతిరేకముగా నడుచు.
  • "ఈ కాలంలో కులాలు మతాలు పాటించడం ఏటికి ఎదురీదడమే." వా.
  • చూ. ఎదురీత.