పుట:PadabhamdhaParijathamu.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4 అంగ........................................అంగ

అవల భయపడ్డ వారంగడి బడితే దొర, లోపుల విచారించి వూరడింతు రంత లోనె. తాళ్ళ. సం. 80-70

అంగడివాడ
బజారు, అంగడి వీధి.
అంగడివీధి
బజారు.

చిత్తూరు జిల్లాలో నేటికి బజారును అంగడి వీధి అనే అంటారు. అంగళ్ళున్న వీధి.

అంగదట్టము
పావడ, గాగర, (అంగధట్టి = కన్నడం)

తతనితంబా భోగ ధవళాంశుకములోని యంగదట్టపు గావి రంగు వలన, శసి కాంత మణి పీకి జాజు వారగ. మను: 2.27

అంగన్యాసం
జపానికి ముందు ఆయా అవయవాలను ఆయా మంత్ర భాగం అంటూ తాకుట.

చూ: కరన్యాసం.

అంగ ప్రదక్షిణం
ఏ దేవాలయాన్నో తిరిగి ప్రదక్షిణం చేయ కుండా తానే గిరగిర తిరిగి ప్ర్దక్షిణం చేయుట.
అంగబిళ్ళ
మాన బిళ్ళ. ఆడ పిల్లల మొలకు కట్టే బిళ్ళ.
అంగభోగము
అంగ పూజ.

పండితా. ప్రధ. దీక్షా. పుట 200

అంగమొల
దిసమొల ... బట్టాబాతా లేని స్థితి.
అంగమొల లగు
దిగంబరులగు:

మదన భూతము సోకిన మగువలు పురుషులు, అదనవిరదలై అంగ మొల లై పెదవి నెత్తురు లీర్చి. ---తాళ్ళ. సం. 9-2=5

అంగయినచోటు
అన్నీ అమరిన చోటు:
అంగరంగ భోగములు
అంగరంగ్ద వైభవము.
అంగరంగ వైభవము
దేవుని ఊరేగింపులో అన్ని హంగులూ ఏర్పరచి బయలు దేర దీసినప్పటి వైభవం.సారం. 1.24

రంగడు అంగరంగ వైభవములతో వేంచేస్తున్నాడు. [బ్రౌన్]

అంగ రక్ష
1. తాయెత్తు, లేక యంత్రము. 2. రక్షకము.

మంత్ర శాస్త్రములో కొన్ని యంత్రాలను రాగి రేకులపై వ్రాసి అట్లే కాని, ఆ రేకులను తాయెత్తులో ఉంచి కాని కట్టితే ఆయా పీడలు ఆయా యంత్రాల మూలంగా తొలగునని అంటారు. .... వర. రా. బా. పు. 116 పంక్తి. 18