పుట:PadabhamdhaParijathamu.djvu/299

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఏక____ఏక 273 ఏక____ఏకా

 • "మ్రాను మీటుగ నెగయ గోమాయు వప్పు, డేకతాళ ప్రమాణ మట్లెగసి కూన...." హంస. 1. 193.

ఏకభుక్తము సేయు

 • ఒక్కప్రొ ద్దుండు. రాత్రి భోజనము మానివేయు.
 • "దశమినా డేకభుక్తము సేసి యవలి నా డోర్చి." ఆము. 4. 50.

ఏ కయి వచ్చి మే కయి బిగియు

 • మెత్తగా వచ్చి చేరి తుదకు తానే అధికారిగా ప్రవర్తించు.
 • "వాడు ఏకయి వచ్చి మేకయి బిగుసుకున్నాడు. ఇప్పుడు ఆ ఊళ్లో వాడి పేరంటే హడలు." వా.
 • చూ. ఏకు మే కగు.

ఏకరాత్రివివాహం

 • ఒకనాటి పెండ్లి. పంచ రాత్రవివాహం, త్రిరాత్ర వివాహం, ఏకరాత్ర వివాహం - ఇవన్నీ ఆ పెండ్లి జరిగే రోజులనుబట్టి వచ్చిన మాటలు.
 • "ఈ కరువురోజుల్లో ఏకరాత్రవివాహమే మంచిది." వా.

ఏకవచనప్రయోగం చేయు

 • చులకనగా పిలుచు. పెద్దలను 'మీరు' అన్నట్లు పలకరించడం మర్యాదగా అలవా టయినది. ఏకవచన ప్రయోగం తద్విరుద్ధముగా యేర్పడినది. కాని పశ్చిమాంధ్రంలోనూ, దక్షిణాంధ్రంలోనూ ఏకవచనప్రయోగం తరుచుగా వినబడుతుంది. అది అక్కడ అవమానసూచకం కాదు.
 • "ఏకవచనప్రయోగం చేశా వంటే మాట దక్కదు." వా.

ఏకవాక్యముగ

 • ఏకగ్రీవంగా.
 • "అందఱు నేకవాక్యముగ నిట్లనిరి." వర. రా. అయో. పు. 251. పం. 9.

ఏకశయ్య నుండు

 • జతకలిసి యుండు.
 • "తనర నానృపు కరస్థలి బట్టి తివియ, నేకశయ్యను వార లిరువురు నుండ." ద్విప. జగ. పు. 200.

ఏకంత మాడు

 • మంతన మాడు.
 • "సుగ్రీవు డేల నాతోడ ము న్నే కాంత మాడె." వర. రా. సుం. పు. 49. పంక్తి. 14

ఏకాంత మిచ్చు

 • రహస్యముగా మాటలాడుటకు వీలు కల్పించు.
 • "ఇట్లు గోవిందు డేకాంత మిచ్చి వినగ." ప్రభా. 2. 21.

ఏకాక్షరప్రయోగం చేయు

 • చులకనగా పిలుచు.
 • "ఏదో ఊరకున్నా నని ఏకాక్షర ప్రయోగం చేస్తావా? చాలా దూరం వెళ్ళిందే వ్యవహారం." వా.