పుట:PadabhamdhaParijathamu.djvu/298

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎవ్వ_____ఏండ్లు 272 ఏండ్లు____ఏక

 • "నా కెవ్వ రిక దిక్కు నలినాయతాక్షి." ద్విప. కల్యా. 138.

ఎవ్వరు ముట్టని ఎముక

 • నిరుపయోగ మయిన దనుట.
 • విశ్వనాథ. శత. 13.

ఎసక మెసగు

 • ఒప్పు.*"వేంకటేశునగరు దా జేరి యిం పెసక మెసగ." కళా. 2. 130.

ఎసపోయు

 • రెచ్చగొట్టు.
 • "రాఘవాభీలకోపాగ్ని నెసపోయు పవనుని యెన్నిక." వర. రా. కిష్కిం. పు. 417. పంక్తి 13.

ఎసరుపెట్టు

 • ఎవరినష్టానికో ఎత్తులు వేయు.
 • "మామగారికి అప్పుడే అల్లుడు ఎసరు పెట్టాడు." వా.

ఎసరెత్తు

 • ఎసరువెట్టు.
 • "కొసరుచు నాతో గూటమి సేసే, యెస రెత్తకుమీ యింకాను." తాళ్ల. సం. 12. 276.
 • చూ. ఎసరు పెట్టు.

ఎస రెత్తుకొను

 • ఎసరు వెట్టు.
 • "ఎసరెత్తుక వెళ్లే వని తోలక, పస దన విధి గలపాటే సుఖము." తాళ్ల. సం. 9. 256.

ఏండ్లు పూండ్లు

 • చాలా కాలం అనుట. జం.
 • "...ఎఱకలు గట్టుకొన్న మఱి యేండ్లును బూండ్లును బట్టు...." మను. 1. 73.
 • "భోగింపగ సీమ కేండ్లపూండ్లకు జాలున్." పాంచా. 4.
 • "నావుడు ముట్టిన జగడం, బీ వేళ నె తీర్ప వేని యేండ్లం బూండ్లన్, నీ వేమి తీర్చె దనుటయు." జైమి. 4. 68.

ఏండ్లు పూండ్లు పట్టు

 • చాల కాలము పట్టు.
 • చూ. ఏండ్లు పూండ్లు.

ఏం డ్లెగసన బుద్ది దిగసన

 • ఏం డ్లొ చ్చే కొద్దీ తెలివి తక్కు వవుతున్నది అనుట. సింహా. నార. 19.

ఏ అంగూ లేదు

 • ఏ సహాయమూ లేదు.
 • "వాడికి ఏ అంగూ లేదు. వాడికి పిల్ల నిచ్చి ఏం ప్రయోజనం?" వా.

ఏకట దీరు

 • తృప్తి తీరు.
 • "వేకపు దలపుల వేంకటేశ! నీ యేకట దీఱద యింకాను." తాళ్ల. సణ్, 12. 276.

ఏకతాళ ప్రమాణము

 • ఒక తాడి యెత్తు. ఎత్తును, లోతును కొలిచేటప్పుడు మనుష్యప్రమాణములతో నిలువు లన్నట్లే తాటిచెట్లతో కూడా లెక్కపెట్టి చెప్పుట అలవాటు.