పుట:PadabhamdhaParijathamu.djvu/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎల్లి___ఎల్లు 271 ఎవ____ఎవ్వ

రూపంలో రోజూ వినబడే మాట.

  • రాయలసీమలో దాదాపు ఇదే అర్థంలో 'రేప టెల్లుండిలో అతను రావాలి మరి' అని తఱుచు వాడుక.
  • "ఎల్లి నేటన భవదగ్రవీధికి గడారటుం డిటు వచ్చు." పాండు. 4. 61.
  • చూ. నే డెల్లి.
  • "ఇయ్యాల రేపు హైదరాబాదులో తెలుగు మాట్లాడడం ఎక్కు వయింది." వా.

ఎల్లి నేటిలో

  • త్వరలో.
  • "నిర్ణయ మా నృపాలునకు నీకును సంగతి యెల్లి నేటిలో." నైష. 2. 59.
  • చూ. నే డెల్లి.
  • వాడుకలో ఇదే అర్థంలో ఇలా వాడుతారు. "వాడు ఉత్తరం రాశాడు. ఈవాళ రేపట్లో రావాలి మఱి.

ఎల్లప్రద్దు చనునే యాలంబునం దొట్టులన్

  • వట్టిమాటలతో కుదరదు. యుద్ధంలో ఎంత సేపూ ఒట్లు వేసుకోవడంతో బీరాలు నఱకడంతో సరిపోతుందా? సరిపో దనుట. కుమా. 8. 139.

ఎల్లుండి ప్రొద్దున ఏకాదశినాడు

  • అనిర్దిష్టదినమును పేర్కొను నప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • "ఎల్లుండి పొద్దున ఏకాదశినాడు వాడు మాయింటికి వస్తాడు." వా.

ఎవడు పట్టితే వాడు

  • ప్రతివాడు.
  • "ఈ పనిని ఎవడు పడితే వాడు చేస్తాడు." వా.

ఎవరికి వారే యమునాతీరేగా

  • ఒకరి కొకరికి సంబంధము లేకుండా.
  • "వాళ్లింట్లో అంతమంది ఉన్నా ఎవరికి వారే యమునాతీరేగా ఉంటారు." వా.

ఎవరి ముక్కులో పెడదా మని?

  • ఎవరికీ చాల దనుట.
  • "ఇంట్లో పదిమంది ఉంటే అరవీశె వంకాయలు తెచ్చారే. ఎవరిముక్కులో పెడదా మని." వా.

ఎవరు తిన్నట్టు?

  • దీనివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు అనుపట్ల ఉపయోగిస్తారు/
  • "ఆ కాస్త గడ్డకోసం కోర్టులకు వేలు గుమ్మరించడం ఎందుకో? ఎవరు తిన్నట్టు?" వా.

ఎవ్వరి కెవ్వరు? దేని కేది?

  • నీకూ నాకూ సంబంధం లేదు. నీ వెవరో నే నెవరో అనుట.
  • "ఏ, నెవ్వతె నీ వెవండ విక నెవ్వరి కెవ్వరు దేని కేది." రాధి. 4. 69.

ఎవ్వరు దిక్కు?

  • సహాయము ఎవారూ లే రనుట.