పుట:PadabhamdhaParijathamu.djvu/296

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎలు____ఎల్ల 270 ఎల్ల____ఎల్లి

పెద్దప్రయత్న మెందుకు ? అనుటలో ఉపయోగించే పలుకుబడి. కుమా. 2. 60.

 • చూ. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం.

ఎలుగించు

 • పిలుచు.
 • "ఉచ్చుచ్చురే శంకరోచ్ఛిష్టభోగి... అని యిటు లెలు గించునమ్మాత్ర లోన." బస. 7. 183.

ఎలుగుబంటి క్షవరం

 • తెగనిది, అసాధ్య మైనది. ఎలుగుబంటికి ఒళ్లంతా వెండ్రుకలే కనక ఎక్కడని క్షవరం చేయడం సాధ్యం? దానిపై వచ్చినపలుకుబడి
 • "ఇదంతా తప్పులతడక. దీనిలో సవరణలు ఎలా సాధ్యం/ ఎలుగుబంటి క్షవరంగా తయా రవుతుంది." వా.

ఎలుగుబంటి తంటసంపని

 • అసాధ్యము. ఎలుగుబంటిమీద ఉన్న వన్నీ వెంట్రుకలే కనుక తంటసంతో ఒక్కొక్క వెంట్రుక లాగివేయడం అసాధ్యం. అందుపై వచ్చినపలుకుబడి.
 • చూ. ఎలుగుబంటి క్షవరం.

ఎల్ల

 • ఏడుగడ. సీమాంతం. అంత కంటెగొప్పది, ఆవల లేదనుట.
 • "ఎల్ల పర్వతముల కెల్ల తీర్థముల కెల్ల యై." పండితా. ద్వితీ. పర్వ. పుట. 250.

ఎల్లచోట తామ యగుచు

 • అన్ని చోట్ల తామే అయి. అంతట తిరుగుచు అనుట.
 • "చూపుదనుక నెల్లచోట దోటయందు దామ యగుచు." పారి. 3. 51.

ఎల్లనాడు నేనాడు

 • ఎల్లప్పుడు. నొక్కి చెప్పుటకై రెండు రకాలా చెప్పడం.
 • "నాడు నే డన కెల్లనాడు నేనాడు." పండిత. ద్వితీ. పర్వ. పు. 236
 • చూ. నాడు నేడనక.

ఎల్ల వెంటల

 • అన్ని విధాల.
 • "ఎల్లవెంటలం జెడితిమి." హర. 3. 15.

ఎల్లి ద మగు

 • చులకన అగు.
 • "నీ కింతభయంబు లే కడుగ నెల్లిద మైతిమె మాట లేటికిన్." మను. 2. 41.

ఎల్లిదము చేయు

 • చులుకన చేయు.
 • "దాని కే నిపుడు ప్రేమం బంపినన్ దీని నెల్లిదముం జేసినజాడ దోచు నొకొ." పారి. 1. 54.

ఎల్లి నేటను

 • ఇటీవల, ఇంతలో, ఈ రోజులలో.
 • ఇది తెలంగాణాలో 'ఇయ్యాల రేపు' (ఈ వేళ, రేపు) అనే