పుట:PadabhamdhaParijathamu.djvu/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎర_____ఎర్ర 268 ఎఱ_____ఎఱ్ఱ

ఎరవు చేయు

  • ఉపేక్షించు.
  • ఇంద్రనందను కేళి నెరవుచేసి." రుక్మాం. 3. 182.
  • "ఏను మూ చెలి నిం తేల యెరవు సేయ." శకుం. 2. 75.
  • వేఱు చేయు, పరాయిదానిగా భావించు. 'ఎరవలి సొత్తు' 'ఎరవలి తెచ్చుకొను' ల లోనూ ఉన్న ఎరవు పరశబ్ద ప్రతీకం కావచ్చును.
  • "నెఱి లేక నీతోడి నీడ యై గెడగూడి పరగిన నన్నింత యెరవు సేసి." కుమా. 5. 123.

ఎరవు లిచ్చు

  • ప్రతిఫలాపేక్ష లేక యితరులకు బదులుగా నిచ్చు.
  • "ప్రాణుల కెల్లను ఎరవు లిచ్చిన చేతులు..." తాళ్ల. సం. 5. 108.
  • "ఎరవలిసొమ్ము బరువులచేటు." సా.

ఎరసంజె

  • సంధ్యారాగము. క్రీడా. పు. 89.

ఎరువు చల్లు

  • పొలమునకు ఎరువు వేయు.
  • "ఎరువు జల్లెడు వేళ నెరువు జల్లు..." కళా. 4. 79.

ఎర్రని యేగాని లేదు

  • దమ్మిడీ లేదు.
  • "వాడి చేతిలో ఎర్రని యేగాని లేదు. వా డేం వ్యాపారం చేస్తాడు?" వా.

ఎఱయ గట్టు

  • విఱుగగట్టు.
  • "ఎట్టుకొనిపోయెదరు విప్రు నెఱయగట్టి." శివ. 4. 61.

ఎఱిగినవి నాల్గు నొడువు

  • తెలిసిన యే కొంతో చెప్పు. నేటికీ యిది వాడుకలో 'ఏవో తెలిసిన నాలుగు మాటలూ చెప్తాను' అనేరకంగా వినవస్తూనే ఉంటుంది.
  • "ఎఱిగినవి నాల్గు నొడువ నే మయిన లెస్స." ఆము. 4. 68.

ఎఱిగి యెఱిగి

  • తెలిసి తెలిసి - నొక్కి చెప్పుటలో పునరావృత్తి.
  • "శివు బరమాత్ము నెఱిగి యెఱిగి, దూషింప నీకు నో రెట్టు లాడె." కుమా. 2. 29.

తెలిసి తెలిసీ వాడు అక్కడికి పోయాడు. అవమానపడ్డాడు."

  • చూ. చేసి చేసి.

ఎఱుగనయ్యెద

  • ఎఱుగను.
  • "అకట ! యదేమియో యెఱుగ నయ్యెద." పారి. 1. 73.

ఎఱ్ఱగా బుఱ్ఱగా ఉండు

  • కాస్త అందంగా ఉండు.
  • "ఆ అబ్బాయి కాస్త ఎఱ్ఱగా బుఱ్ఱగా ఉంటాడు." వా.

ఎఱ్ఱలు ద్రోలు

  • ఎఱ్ఱవారు.