పుట:PadabhamdhaParijathamu.djvu/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎన్ని____ఎన్ని 267 ఎన్నె___ఎర

వీలయినభూమి కూడా ఒక ప్రమాణంగా తీసుకోవడం అలవాటు.

  • ఇలాగే పగ్గముపట్టు. ఒక పగ్గం పొడువుగా ఉన్న నేలను పగ్గముపట్టు అంటారు. పాండు. 278.

ఎన్ని తలలు ?

  • ఎన్ని గుండెలు ?
  • అంత ధైర్యమా ? అంతకు సమర్థుడా అనుట.
  • "అకట! యీప్రాణి యనిదితాత్మకుడు గాన, దైవికమున మహావిపత్ప్రాప్తు డయ్యె, ననుచు దయ చేయవలయు నిట్లైన వారి, యెదుట నిలువంగ గ్రోధుని కెన్నితలలు ?" ప్రబోధ. 4. 27.
  • చూ. ఎన్ని గుండెలు/

ఎన్ని యెదలు కలవు ?

  • ఎంత ధైర్యం ? ఎన్ని గుండెలు ? అని నేటి వాడుక. అంత ధైర్య ముందా వానికి అనిభావం.
  • "అంగభవుడు నిన్ నిచ్చ నెఱిగి, యెఱిగి పైనెత్తి రానెన్ని యెదలు గలవు." కుమా. 9. 42.
  • చూ. ఎన్నిగుండెలు?

ఎన్నియేని

  • ఎన్నైనా, చాలా అధికముగా. భీమ. 1. 31.

ఎన్నెదల్ గల్గె

  • ఎన్నిగుండె లున్నవి అని నేటి వాడుక. ఎంత ధైర్యం ? అంత ధైర్యం ఉన్నదా ? అనుట.
  • "కన్నంతటను జూడ గా దనుతపసి, కెన్నెదల్ గల్గె నీకిటు గుడ్వ బెట్ట." బస. 6. 164 పు.
  • చూ. ఎన్ని గుండె లున్నవి ?

ఎప్పు డెప్పు డని యెదురు చూచు

  • ఆతురతతో ఎదురుచూచు.
  • "ఎప్పు డెప్పు డటంచు నెదురు చూచుచు మది, గలగు చుండెడు నుషాకన్య జేరి." ఉషా. 2. 58.

ఎమ్ములు చిల్లులు వోవ నాడు

  • మర్మభేద మైన మాటలాడు.
  • "ఎమ్ములు చిల్లులు వోవ నాడినన్." సారం. 3. 67.

ఎమ్ములు సిన్న మగు

  • ఎముకలు నుసి యగు.
  • "ఏడ్చు నమ్మ యెమ్ములు సున్న మయ్యె నేడు." వ్యస. నాట. 33.

ఎమ్మె లుపచరించు

  • వేషములువేయు, వగలుపోవు.
  • "మా, చెలి యిదె పుష్పదామకముచే నిను గట్టగ గంటి మింక నె, మ్మెలు పచరింప రా దనుచు." పారి. 5. 81.

ఎరలేని గాలము

  • పైకి ప్రమాదమని తెలియ నీయకుండా ప్రమాదము చేయునది. రామలిం. 31.