పుట:PadabhamdhaParijathamu.djvu/289

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎదు____ఎదు 263 ఎదు____ఎదు

 • "కన్నులు చల్లగా గందుమో యనుచు నెదురులు చూచుచు నుండంగ." వర. రా. అయో. పు. 250. పంక్తి. 16.

ఎదురులేదు

 • అడ్డము లేదు. సాటి లేదు, ప్రతి లేదు.
 • "మహాంధ్రకవితావిద్యాబలప్రౌఢి నీ, కెదు రేరి." పాండు. 1. 27.
 • "వాడిమాటకు ఆ వూళ్ళో ఎదురు లేదు." వా.

ఎదురు వెట్టు

 • పెట్టవలసినవారికి కాక ఇతరులకు పెట్టు; తాను పొందవలసి ఉండగా వారికే తాను పెట్టు.
 • 'ఆ పిల్ల (కొత్తకోడలు) ఇంట్లో దంతా ఎదురు పెడ్తా ఉంది' అని అత్త ఆడబడుచులలాంటి వా రంటారు.
 • "ఎల్లసొమ్ములు జారుల కెదురు వెట్ట, సాగె నిచ్ఛావిహారనిశ్చలత మీఱ." శుక. 3. 350/
 • "ఇటుల నజ్జారశేఖరు డేల బట్టి యింటిలో నున్నవస్తువు లెదురువెట్టి." హంస. 2. 112.
 • "ఆ వ్యాపారంలో దిగాను. నేనే పది వేలు ఎదురుపెట్టవలసి వచ్చింది." వా.

ఎదురు వెట్టి చదరంగ మాడు

 • ఎదుటువానికి కూడా తానే డబ్బిచ్చి వానితో జూదమాడు.
 • కొవ్వెక్కి గాడిదలతో తన్నించుకొనుట వంటిది.
 • "ఎదురువెట్టి వేడ్క జదరంగ మాడెడు, పగిది నీకు గల్గు పడుపు గూటి, సొ మ్మొసంగి చేర రమ్మన్న గైకొను, నట్టివాడు ముద్దుపట్టి! విషము." చంద్రరేఖా. 2. 61.

ఎదురు వేలములు

 • భీమ. 4. 47.

ఎదురెక్కు

 • ఎదురుగా నేగు. ఆము. 1. 5.

ఎదురెదుర అను

 • ముఖాముఖి అను. వాడుకలో 'మొగా న్నే ఏ మంటాం?', అన్న రూపంలో ఉంటుంది.
 • "ఏ మెదు రెదుర మి మ్మేమందు మయ్య." బస. 7. 182.
 • "ఎదురుగా ఏ మంటాం చెప్పండి?" వా.
 • "వెనుక ఎన్ని అనుకున్నా ఎదురుగా ఏ మంటారు?" వా.

ఎదురెదురుగా

 • ఎదురుబదురుగా.
 • "ఎదురెదుర నిచ్చు పువ్వుదోయిలియు బోలె." కవిక. 4. 771.

ఎదురొడ్డు

 • 1. మార్కొను.
 • "విడిసె బతి సేన కెదురొడ్డి విమత సేన." కవిక. 2. 147.
 • 2. కాచుకొనుటకు ఎదురు దెబ్బ తీయు.
 • "అత డెదురొడ్డినట్టి శూలాయుధమును, హరియురము గాడి యారౌతు శిరము పైకి..." కళా. 8. 99.