పుట:PadabhamdhaParijathamu.djvu/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎదు_____ఎదు 262 ఎదు____ఎదు

ఎదురుచుక్క

  • ప్రతిస్పర్ధి. ఇది జ్యోతిశ్శాస్త్రరీత్యా వచ్చిన పలుకుబడి. చుక్క యెదురుగా నున్నప్పుడు ప్రయాణాదులు చేస్తే అశుభం కలుగుతుం దని ప్రతీతి.
  • "ఎపుడు శాత్రవకోటి కెదురుచు క్క గుచు." రం. రా. బాల. పు. 9. పం. 15.
  • "ఏదులకు మిత్తి లేళ్ళకు నెదురు చుక్క." శుక. 2. 283.
  • "ఎదురింటివారం కెదురుచుక్క." శుక. 3. 20.
  • "వాడికి వీడికి చుక్కెదురు." వా.
  • రూ. చుక్కెదురు.

ఎదురు చూచు

  • 1. నిరీక్షించు.
  • "నీ రాక కెదురుచూచు, నయనములు వేయి విరియించి నాకభర్త." శృం. నైష. 4. 64.
  • 2. ముఖాముఖి చూచు. అంటే అంతకు తక్కువవాడు కా డనుట.
  • "కమనీయ రూపరేఖావిలాసస్ఫూర్తి, నేభర్త శ్రీభర్త నెదురుచూచు." ఆనంద. పీఠి. 46.
  • చూ. ఎదురులు చూచు.

ఎదురు తిరుగు

  • ధిక్కరించు.
  • "తండ్రికే ఎదురు తిరిగి మాట్లాడేవాడు మనమాట వింటాడా!" వా.

ఎదురు తెన్నులు చూచు

  • నిరీక్షించు.
  • "ఆయనకోసం ఎదురు తెన్నులు చూడ్డంతో సరిపోతున్నది." వా.

ఎదురుత్తర మిచ్చు

  • బదులు చెప్పు.
  • "ఉత్తమనాథు డీత డెదురుత్తర మీ డొకనా డదే మకో." కా. మా. 3. 44.

ఎదురుత్రోవాలు చూచు

  • నిరీక్షించు.
  • "ఇంద్రద,త్తున కభిలాషతో నెదురు త్రోవలు చూచుచు." భోజ. 3. 255.

ఎదురు నడచు

  • ఎదురేగు. గౌరవసూచకంగా కూడా.
  • "ఇవ్విధంబున బ్రాగ్జ్యోతిషపతి యా యంగపతికి నెదురునడిచి యుద్ధ సన్నాహంబు చెన్నుమీఱ." కళా. 8. 120.

ఎదురుపడు

  • ఎదు రగు; ప్రతిఘటించు.
  • "జార శేఖరు డా వెలదికి నెదురు పడియె." హంస. 2. 117.
  • "వారికి, నరనందను డెదుర్పడి గుణ ధ్వని సెలగన్." భార. భీష్మ. 2. 313.

ఎదురు బదురుగా

  • ముఖాముఖిగా.
  • "వారిద్దరూ ఎదురు బదురుగా కూర్చోడం తప్పితే చేసే దే ముంది?" వా.

ఎదురులు చూచు

  • నిరీక్షించు.