పుట:PadabhamdhaParijathamu.djvu/284

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎత్తు____ఎత్తు 258 ఎత్తు____ఎత్తు

ఎత్తుక వచ్చు

 • 1. తీసుకొని వచ్చు; 2. లేవ దీసుక వచ్చు; 3. దొంగిలించు.
 • "ఆ ముద్దియకు బుద్ధి జెప్పి యెత్తుకొని వచ్చెదము." ప్రభా. 5. 18.
 • "గిన్నె యెత్తుకొని బొంకుల్ పల్కుచున్." విప్ర. 5. 15.
 • "వా డా పిల్లను యెత్తుకపోయా డట." వా.

ఎత్తుకు పైయెత్తు వేయు

 • యుక్తికి ప్రత్యుక్తి పన్ను.
 • "వీడు కల్లంగడి వానికి పోకుండా పైపాట పాడాడు. వాడేమో యిప్పుడు మద్యపాననిషేధదళంలో చేరి ప్రచారం మొదలుపెట్టాడు. ఎత్తుకు పైయెత్తు వేయడం తప్పితే వాడూ వీడూ యిద్దరూ ఒకటే." వా.

ఎత్తు కెత్తు బంగారముఇచ్చి....

 • అమూల్యము, విలువ గలది. ఆ వస్తువునకు సరిపడినంత తూకము గల బంగారమును ఇచ్చి తీసికొనుట ఆ వస్తువుకున్న అమూల్యతను సూచించును. బంగారానికి ఇం కేపర్యాయపద మైనా చేరవచ్చును.
 • "ఎత్తు కెత్తు మెఱుంగు కుందన మిచ్చి తెచ్చితి మీసిరాజులు." శుక. 1. 222.
 • "ఎత్తుకెత్తు బంగార మిచ్చినా ఈ వస్తు వివ్వను." వా.
 • "ఆ పిల్లకు ఎత్తుకెత్తు బంగార మిచ్చినా తీరదు." వా.
 • "ఆ పనికి ఎత్తుకెత్తు బంగార మీయవచ్చు." వా.

ఎత్తుకొని పోవు

 • లేవదీసికొని పోవు. ఇది యీ నాటికీ రాయలసీమలో వాడుకలో ఉన్న పలుకుబడి.
 • "వాడు ఆ రంగనాయకిని ఎత్తుకొని పోయినా డని ఊరంతా ఒకే అనుకోవడం." వా
 • చూ. ఎత్తుక పోవు.

ఎత్తుకొని తిను

 • అడుక్కొని తిను.
 • "ఉన్నపొలం కాస్తా అమ్ముకొంటే ఎత్తుక తింటావా?" వా.

ఎత్తుకొను

 • పూనుకొను; ఆలోచించు; తలంచు.
 • "కుల మెల్ల జెఱచి నీకును గర్త యైన, యిలపతి బొలియింప నెత్తుకొన్నావు." వర. రా. అయో. పు. 397. పంక్తి. 15.
 • "వాడీమధ్య నా విషయమే బొత్తిగా ఎత్తుకోవడం లేదు." వా.

ఎత్తుగడ

 • ఆరంభము.
 • "ఆ పాట ఎత్తుగడ చాలా బాగా ఉంది గాని రాను రాను తేలిపోయింది." వా.
 • "పద్యం ఎత్తుగడ బాగా ఉంది." వా.

ఎత్తుదెంచు

 • ఎత్తి వచ్చు, దండెత్తి వచ్చు. కుమా. 10. 125.