పుట:PadabhamdhaParijathamu.djvu/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎత్తి____ఎత్తి 257 ఎత్తి____ఎత్తు

ఎత్తినకోలగా

 • ఎత్తినబాణం ఎత్తినట్లుగా. వెంటనే.
 • "ఎత్తినకోలగా మదను డేసిన వే చని వచ్చు నర్ధచం,ద్రోత్తరబాణమో యనగ నొప్పెడుపాపటతో." కళా. 7. 126.

ఎత్తినడుగుల నుండు

 • ఎప్పుడెప్పు డని ఆతురతతో ఉండు.
 • కాళ్లెత్తి నిల్చి చూస్తున్నారు అనుటపై వచ్చినది.
 • "గొంతి కోడండ్రు రెల్లను గురువరేణ్య! యెత్తినడుగుల నున్నవారు." భార. ఆశ్ర. 2. 25.

ఎత్తినభీతి

 • భయముతో.
 • "వాసవుం, డెత్తినభీతి బ్రహ్మకడ కేగి ప్రణామము చేసి ఖేదముం, దత్తఱపాటు జెప్పిన." ఉ. హరి. 2. 187.

ఎత్తిపెట్టు

 • దాచిపెట్టు.
 • "ఈ డబ్బు ఎత్తిపెట్టు." వా.

ఎత్తి పొడుచు

 • దెప్పు.
 • "ఈరా లెఱింగిన నెత్తిపొడుచు." భాగ. 10.వూ. 978.
 • "అత్తగా రెప్పుడూ ఏదో ఒకటి ఎత్తి పొడుస్తూ నే ఉంటుంది. వా.

ఎత్తిపోతలు

 • పోషణము.
 • "ఆ ! వాళ్లతల్లి ఉన్నంతవరకూ ఎత్తి పోతల కేం లోపం లేదు." వా.

ఎత్తిపోవు

 • దండెత్తు.
 • "తండ్రిబిడ్డ యన్న దమ్ముడు నాకెత్తి, పోయి పోటు లాడి పుడమి గొండ్రు." భార. భీష్మ. 1. 42.

ఎత్తి వచ్చు

 • దండెత్తి వచ్చు. కుమా. 10. 167.
 • "సరగున దుర్గముల్ సాధింప జనువేళ, వైరిభూభుజు లెత్తివచ్చు వేళ." శుక. 1. 235.
 • "అనికిన్ బలనూదను డెత్తివచ్చినన్, దీలుపడంగ దోలి యిట దెచ్చెద నిచ్చెద బారిజాతమున్." పారి. 1. 135.

.....ఎత్తు

 • ప్రస్తావించు.
 • "ఆ సంగతి నా దగ్గఱ యెత్తవద్దు." వా.
 • "ఇకమీద ఈ సంభాషణ నీ దగ్గఱ ఎత్తితే ఒట్టు !" వా.

ఎత్తు ఎఱుగక

 • చాక చక్యము లేక; తెలివి తక్కు వై. చదరంగముద్వారా వచ్చిన పలుకుబడి. ఒక ఎత్తు వేసినప్పుడు దానికి సరిగా ఎత్తు వేయవలసి ఉంటుంది. ఆ యెత్తు వేయుటకు తెలియక పోయె ననుట.
 • "అవ్విష్ణుశర్మయు నె త్తెఱుంగక యి త్తెఱంగున మాటలాడి నోటికూటికి జేటు దెచ్చుకొంటిని గదా..." శుక. 3. 364.