పుట:PadabhamdhaParijathamu.djvu/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎకా___ఎక్క 248 ఎక్క___ఎక్క

ఎకాయకిగా

  • మధ్యలో ఆగకుండా.
  • "అమ్మకు చాలా జబ్బుగా ఉం దని తంతి వచ్చేసరికి ఎకాయెకిగా బయలుదేరి వచ్చాను." వా.
  • రూ. ఎకాయెకిని.

ఎక్కడ చూచిన...

  • అన్నిచోట్ల.
  • "ఎక్కడ జూచిన నిండ్లపై బసిడికుం,డలు క్రొత్త మెఱుగిడి నిలుపు వారు..." కళా. 7. 58.
  • "ఎక్కడ చూచినా తోరణాలే. జెండాలే. ఊరంతా వెలిగిపోతున్నది." వా.

ఎక్కడను ప్రొద్దు పొడుచు టెఱుగక

  • ఏ కష్టమూ తెలియకుండా.
  • "మ్రొక్కెదము సామి నీదయ, నెక్కడనుం బ్రొద్దు పొడుచు టెఱుగక నీవే, దిక్కని యందుము దాయలు, గ్రక్క తిలం గడుపుచల్ల కదలక యుండన్." రామాభ్యు. 2. 7.

ఎక్కడ పట్టిన నక్కడ

  • ప్రతిచోట.
  • "ఎక్కడ బట్టినం గళల యిక్కువ లెక్కడ నోరు సోకినన్, జక్కెర లప్పలు." కా. మా. 1. 43.
  • "వాడు ఎక్కడ పడితే అక్కడ అప్పు చేశాడు." వా.

ఎక్కడ పొడిచితే ప్రొద్దా అను

  • ఏ కష్టమూ లేక హాయిగా నుండు.
  • "...మత్తిల్లి యుష్మత్కథా బోధం బొందితి, మెక్కడం బొడిచితే ప్రొద్దా యటంచున్ సుఖ, శ్రీధన్యస్థితి రామరాజ్యమువలెం జే ఱొమ్ముపై జేర్చుచున్." బహులా. 1. 115.

ఎక్కడ లేని....

  • విపరీత మైన.
  • "నాకు ఎక్కడలేని కోపం వచ్చింది." వా.
  • "ఎక్కడలేని కపటమూ వాడి దగ్గర ఉంది." వా.
  • "వానికి తన భార్యమీద ఎక్కడ లేని ప్రేమ." వా.

ఎక్కడి కెక్కడ ?

  • దానికీ దీనికీ సంబంధము లే దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వారి వీరి బలసంపద లెక్కడి కెక్కడా నృప, గ్రామణితోడ..." రుద్రమ. 22. పు.

ఎక్కడి జగజోలి

  • ఇ దెక్కడి పీడ, ఇ దెక్కడి సంతన; ఇదేమి పీకులాట- అనుపలుకుబళ్ల వంటిది.
  • నా జోలి కాదు, ఊరివారి జోలి అన్న అర్థంలో జగజోలి యిక్కడ ప్రయుక్తమయింది. వావిళ్లలో, సూ. ని. లో కూడ జగజోలి = మిక్కిలి మోసగాడు అన్న అర్థం యిచ్చారు గానీ వా రిచ్చినప్రయోగాలలోనే అది అతకదు.
  • "....తనకార్య మైనయందాక విరా,ళి గదింతు రంత నెక్కడి, జగజోలి