పుట:PadabhamdhaParijathamu.djvu/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎంత____ఎందు 247 ఎందు____ఎక

 • "మార్పెట్టు నోపనిమ్రాకు లేర్చుట యెంత, వా లగు నని వనవహ్ని నవ్వు." కుమా. 10. 159.

ఎంతసేపూ

 • ఎల్లప్పుడూ అనుట.
 • "ఎంతసేపూ వాడికి ఆత్మస్తుతీ, పరనిందా తప్పితే మరొకటి లేదు కదా !" వా.
 • చూ. ఎంతదాకా.

ఎందాక ? (ఎంతదనుక)

 • ఎక్కడికి పోతున్నారు అనుట. ఎక్కడికి అని అడగడం అపశకున మని ఎంతదాక అని అడుగుట అలవాటు.
 • "పొద్దున్నే బయలు దేరారు. ఎందాకా ?" వా.

ఎందు కైనా మంచిది

 • అంత ప్రయోజనం లేక పోయినా ఎంతో కొంత మేలు ఉండక పోదు.
 • కామేశ్వరి. శత. 85.
 • "ఆయనను వెళ్లి ఒకసారి చూడు. ఎందు కైనా మంచిది." వా.

ఎందు పెరటిచెట్టు మందు కాదు.

 • సన్నిహితులు చెప్పే హితవు తల కెక్కదు.
 • 'అతిపరిచయా దవజ్ఞా' అన్న సంస్కృతసూక్తిని తెలిపే పలుకుబడి.
 • పెరటిచెట్టును తేలికగా చూస్తారు కదా !
 • "తమకు సులభ మైన నమృతంబు గైకొన, రెందు బెరటిచెట్టు మందు గాదు." కళా. 7. 39.

ఎందు లేని

 • ఎక్కడ లేని.
 • "ఎందు లేనిపలుపోకల మాయలు నీకు వెన్నతో బెట్టినవి." పారి. 1. 127.
 • ఇది వాడుకలో 'ఎక్కడ లేని' అనేరూపంతోనే కనబడుతుంది.
 • చూ. ఎక్కడ లేని.

ఎంబెన్న

 • యంబ్రహ్మ.
 • "ఓ అంటే నా రాని యెంబెన్నలదే యీ రోజులలో అధికారంగా ఉంది." వా.
 • చూ. యంబ్రహ్మ.

ఎకసక్కె మాడు

 • వేళాకోళము చేయు.
 • "ఎవ్వారి బొడ గన్న నెకసక్కెమాడుచు." విప్ర. 5. 26.
 • చూ. ఎకసక్కెము లాడు.

ఎకసక్కెము చేయు

 • హాస్యము చేయు.
 • "నీ విట వచ్చుట పారిజాతవా,సన బ్రకటించి నాకు నెకసక్కెము సేయన కాదె చెప్పుమా!" పారి. 1. 128.

ఎకసక్కెము లాడు

 • పరిహాస మాడు.
 • "చక్కెర వింటి వాని నెకసక్కెము లాడడె." నిరంకు. 2. 12. కాశీ. 4. 123.
 • చూ. ఎకసక్కెము చేయు.