పుట:PadabhamdhaParijathamu.djvu/272

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎంత____ఎంత 246 ఎంత____ఎంత

చిన్నవే పెద్దవానిపై తిరుగ బడెనే అనుట.

 • "ఉగ్రుపై నట వోయె దకట లగ్గ మేలు మే, లెంత మీ లెంత మీల ద్రాగు." కుమా. 4. 66.

ఎంతయిన

 • 1. చాలా.
 • "మానవిఖ్యాతి లాభసంపన్ను డగుట, యెంతయిన నొప్పు నట్టు గాదేని హాని." శుక. 1. 367 పు.
 • వాడుకలో అ దెంతైనా బాగున్నది అనడం కద్దు.
 • 2. ఏమయినా.
 • "ఎంతయినా పెద్దవాడుకదా ! నీ విలా ఎదిరించ వచ్చునా ?" వా.

ఎంత లే దన్నా

 • కనీసం.
 • "ఇప్పటి కెంత లే దనిన నిర్వదికిన్ బయి నుండు." పాణి. 1. 39.
 • "ఎంత లేదన్నా ఈ పెండ్లికి పదివేలు ఖర్చు పెట్టి ఉంటాడు. వాని కేం ? కలవాడు." వా.

ఎంత లే దింతె కద!

 • అయితే అయింది లే అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
 • "అనుడు నాతండు తత్సంగమాస జేసి, యెంత లేదింతె కద దీని కేల వగవ ?" శుక. 3. 195.

ఎంత లేదు ?

 • ఎంతో ఉన్నది. ఇది పోయిన దని దు:ఖ మేల అనుట.
 • "అని పల్క నత్త కనికర, మున రావే యెంత లేదు..." శుక. 2. 581.

ఎంతవారును...

 • ఎంతవా రైనా అని వాడుక రూపం. ఎంత గొప్పవారైనా అని అర్థం.
 • "ఎంతవారును దెలియంగ నెంతవారు." కాశీ. 1. 104.
 • "ఎంతవార లైన కాంతదాసులే." త్యాగరాజ కీర్తనలు.
 • పై ప్రయోగంలోని రెండవ 'ఎంతవారు' ఈ అర్థాన్నే సూచిస్తుంది.
 • 'ఎంతవాడికి ఆ పని సాధించడం సాధ్యం కాదు' అని ఏకవచనంలో కూడా ఇది ఉంది. ఈ ఉచ్చారణలోని కాకువును పురస్కరించుకొని ఈ 'ఎంత' అది అతి సులభము, కించిన్మాత్రము అనే అర్థాలను కూడా స్ఫురింప జేస్తుంది.
 • "ఇంత పెద్దపని చేయడానికి వా డెంతవాడు ?
 • "వాడికి ఈ పని యెంత ? ఒక్క నిమిషంలో చేసి పారేస్తాడు."

ఎంతవాలు ?

 • ఏం గొప్ప ? ఏమి నేర్పు ? వాలూ చాలూ తెలిసినవాడు అన్నప్పుడు నేర్పు, కిటుకు అన్న లక్షణార్థం వాలు కున్న దే.