పుట:PadabhamdhaParijathamu.djvu/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎంత____ఎంత 245 ఎంత___ఎంత

ఎంత తీపు!

  • ఎంత ఆసక్తి; ఎంత ఆశ !
  • "భూమికి గాగ... ఘోర సంద్రామము సేయుచుండుదురు రాజులు దొల్లియు నెంత దీ పొకో." భార. భీష్మ. 1. 15.

ఎంత దఱిగిన మిరియాలు జొన్నల సరిపోవా ?

  • ఎంత చెడ్డా సత్త్వమున్న వాడు సత్త్వ మున్నవాడే అనుట. ఇదే అర్థంలోనే పడుకున్నా ఏనుగు గుఱ్ఱం ఎత్తుంటుంది అన్న లాంటి పలుకుబడు లున్నవి. మిరియాలు విలువ గలవి. జొన్నలు చాలా చౌక, ఎంత చెడ్డా మిరియాలు జొన్నల వెల చేయవా అనుట.
  • "ఎంత దఱిగిన మిరియా, లుం జొన్నల సరిపోవే, లంజెతనములందు గొమిరెలన్ గెలువవటే!" ఉ. హరి. 1. 75.

ఎంతదనుకా

  • చూ. ఎంతదాకా.

ఎంతదాకా

  • ఎంత సేపూ.
  • "ఎంత దాకా వాడిమాట వాడి గానీఒకడు చెప్పేది కించిత్తైనా గ్రహించడు." వా.
  • చూ. ఎంతసేపూ.

ఎంతపని వచ్చినను

  • ఎంత అవసరము ఏర్పడినను.
  • "ఎంతపని వచ్చినను నిదె, చెంతనె యున్నాడ భీతి జెందకు మనినన్." హంస. 3. 222.
  • "ఎంతపని వచ్చినా నే నున్నాను గదా. నీ వలా కూచో బావా! ఎందుకు దిగులు పడతావు?" వా.

ఎంతమా టంటే అంతమాట అను

  • నోటికి వచ్చినట్లు దుర్భాష లాడు.
  • "నీవు సంపన్నుడ వైతే కావచ్చు, అంతమాత్రాన నీవు ఎంతమా టంటే అంత మాట అంటూంటే ఊరుకుంటానా ఏమిటీ?" వా.
  • "అ దేం కోడలో నమ్మా ! వాళ్ళత్తను పట్టుకొని ఎంతమా టంటే అంతమాట అంటుంది." వా.

ఎంత మీను వచ్చి యెంత మీనును మ్రింగె ?

  • ఎంత చిన్నవాడు ఎంత పెద్దపనికి ఒడబడెను అనుపట్ల ఉపయోగించేపలుకుబడి. పెద్ద చేప చిన్న చేపను మ్రింగుట అలవాటు. తద్విరుద్ధస్థితి నిది సూచించును.
  • "తగరు కొండమీద దాక గోరిన దారి, నెదురు దన్ను దెలియ కింత పలికె, నెంత మీను వచ్చి యెంత మీనును మ్రింగె, గాన త్రుళ్లి నెద్దె గంతమోయు." రాధి. 3 ఆ.

ఎంత మీ లెంత మీల ద్రాగు

  • ఎంత చేపలు ఎంత చేపలను ంరింగ సాగెను ? పెద్దవి చిన్న వానిని మ్రింగును కాని