పుట:PadabhamdhaParijathamu.djvu/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎంగి____ఎండ 241 ఎండ____ఎండ

ఎంగిళ్ళెత్తు

 • నీచపుపనులకు పాల్పడు.
 • "ఆ వెధవ వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఎంగిళ్లెత్తుకుంటూ బతుకుతున్నాడు." వా.

ఎంచులు పెట్టు

 • తప్పులు పట్టు.

ఎండకన్ను ఎఱుగని

 • అ సూర్యంపశ్య యైన, ఏమాత్రం కష్టమూ ఎఱుగని ఇలు వెడలని.
 • "ఎండక న్నెఱుగనియీ రాజచంద్రు, డవని శాత్రవులకు నర్పించి పెక్కు, గానల ద్రిమ్మరి కాయంబు డస్సి." పల్నాటి. 92 పే.
 • "ఎండక న్నెఱుగని యింద్రుని యిల్లాలు, పలుపంచలను జాలి బడియె నేడు." భాగ. 8. 469.
 • "ఎండక న్నెఱుగక యేప్రొద్దు నన్ను, నండ బాయనివాడ వయ్యయో నేడు, ఇంతి యింటికి బోయి యేమంటి వన్న?" సారం. 2. 531.
 • చూ. ఎండకన్ను నీడకన్ను ఎఱుగని.

ఎండకన్ను నీడకన్ను ఎఱుగని

 • ఎండమొగం చూడని; కష్ట మెరుగని.
 • "క్రీడమై నెండకన్నును నీడకన్ను, నెఱుగ కన్నల దమ్ముల హితుల సుతుల, గూడి సుఖ మున్న వారము కోర్కు లొదవ, సత్య సల్లాప! యో హరిశ్చంద్రభూప!" హరిశ్చ. 1. 212.
 • చూ. ఎండకన్ను ఎఱుగని.

ఎండకన్నును వానకన్నును ఎఱుగని

 • కష్ట మెరుగని; ఇలు వెడలని.
 • "వచ్చి రెండకన్ను నీడకన్నును నెఱుంగని పురంధ్రులు..." భార. ఆశ్ర. 1. 113.
 • చూ. ఎండకన్ను నీడకన్ను ఎఱుగని.

ఎండ కెండి వానకు తడియు

 • అన్ని కష్టాలకూ ఓర్చు. తె. జా.

ఎండగట్టు

 • ఎండలో ఆరవేయు.
 • "తడిబట్టలు ఎండగట్టుదా మంటే దండెమైనా లేదు." వా.

ఎండగొట్టు

 • వడ దెబ్బ తగులు. రా. వి. 269.

ఎండతాకు

 • వడ దెబ్బ తగులు.
 • "బెడిద మగునెండతాకున, దొడిమలు వసివాడి." పారి. 4. 19.

ఎండ నుండగ నీడ యెదురు వచ్చు

 • ఎంతో బాధపడుతుండగా, తనంతట ఏదో ఒక ఆశ్వాసము సమకూరు.
 • "ఎండ నుండగ నీడ యెదురు వచ్చుట గదా, సుదతి చల్లనిచూపు జూచె నేని." ఉషా. 3. 49.

ఎండపసుపు

 • అశాశ్వతము. నీరెండ పడి యేర్పడే పసుపు రంగు. పసుపు ఎండలో పెడితే రంగు మారుతుంది అనుటపై