పుట:PadabhamdhaParijathamu.djvu/252

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉవ్వి____ఉసి 226 ఉసు____ఉసు

ఉవ్విళ్ళూర్చు

 • ఉవ్విళ్లూరునట్లు చేయు. కాశీ. 4. 150.

ఉసి ఆడు

 • వీలు చిక్కు.
 • "పదిరూపాయ లయినా యీనెలలో యిస్తా మనుకుంటే యేమీ ఉసి అడ్డం లేదు." వా.
 • చూ. ఉసి చిక్కు, ఉసి దొరకు.

ఉసి కొల్పు

 • కవ్వించు. కుక్కను ఉసికొల్పుట పై వచ్చినపలుకుబడి.
 • "ఉసికొల్పి వంచించి దుసుకుల చనుదోయి చేనంట." రాధికా. 1. 124.

ఉసి చిక్కు

 • ఏదో వీలు కలుగు.
 • "ఏమి చేద్దా మన్నా ఆఫీసుపనితో ఉసి చిక్కడం లేదు." వా.
 • చూ. ఉసి ఆడు.

ఉసి దొరకు

 • చూ. ఉసి చిక్కు.

ఉసి యిచ్చు

 • ప్రోత్సాహ మిచ్చు.
 • "కాస్త ఉసి యిస్తే వా డెంత పనైనా చేస్తాడు." వా.

ఉసివోవు

 • తప్పిపోవు.
 • "ఏసినయే టుసివోయె బోయినన్, మానితి నిస్సిరో యనుచు." కకు. 4. 57.

ఉసు రను

 • అలసి పడిఉండు.
 • "ఉండ లేక నీవద్దనే వుసు రంటి గాక." తాళ్ల. సం. 3. 29.

ఉసురసు రను

 • ఆపసోపాలు పడు.
 • "తా నుసురసు రంచు ఖిన్న యయి యొయ్యన." హరి. 4. 113.

ఉసురుకొను

 • కోలుకొను, బలపడు. కాశీ. 3. 23.

ఉసురు గలిగితే ఉప్పమ్ము క బ్రతుక వచ్చును

 • ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బ్రతుకవచ్చు. సా.
 • "ఉసురు......పద పదండ్రా." హేమా. పు. 18.

ఉసురు తగులు

 • ఎవరి నైనా బాధించగా ఆ పాపఫలితము చుట్టుకొను.
 • "ఆ పిల్లను అంత వేధించాడు. ఆ ఉసురు తగిలే నాశన మై పోయాడు. వా.
 • చూ. ఉసురు తాకు.

ఉసురు తాకు

 • ఈ మనోవేదనవల్ల, ఆ వేదనకు కారణ మైనవానికి చెరుపు తప్పక కలుగును అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "పాన్పు కెక్కించి తనప్రక్క బవ్వళింప, గోరి నే జూడ ఱేలు తా గుడిచి కట్టి, యూరకే యిల్లు వెడలు