పుట:PadabhamdhaParijathamu.djvu/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉల్ల_____ఉల్లి 224 ఉల్లి_____ఉల్లి

  • "వనరుహ నేత్రి దేల్చె యదువల్లభు డుల్లము పల్లవింపగన్." రాజగో. 2. 79.

ఉల్లము ఱాయి చేసికొను

  • కాఠిన్యము వహించు.
  • చూ. మనసు ఱాయి చేసికొను.

ఉల్లల నుడుకు

  • గగ్గోలము, గందరగోళము అగు. కుతకుత ఉడుకు ధ్వన్యనుకరణము.
  • "తన చిత్తమున, దనుకగ నుల్లల నుడుకును, విని శిఖిచో రాది ముఖ్య విషయా పదకున్." భార. శాంతి. 4. 34.
  • "దనుజు లుల్లల నుడుకన్." కుమా. 12. 25.
  • "ఓషధిప్రస్థ ముల్లల నుడుకుచుండ. హర. 5. 10.

ఉల్లస మాడు.

  • పరిహసించు.
  • "మొల్లల నుల్లసం బాడి యాణిముత్తియంబుల నుత్తరించి...పలువరుసయు." పాండు. 3. 179.
  • చూ. ఉల్లసము లాడు.

ఉల్లసము లాడు

  • పరిహాస మాడు.
  • "ఒండొరువుల గరువంబుగ నుల్లసంబు లాడుచును." భార. భీష్మ. 1. 112.

ఉల్లి కుట్టుమాటలు

  • ఎత్తిపొడుపు మాటలు.
  • "సమరమునకు బురికొల్పుచు, మము దలచిన నుల్లికుట్టు మాటల దచ్చి,త్తము లుడికించుచు..." భార. ఉద్యో. 2. 242.

ఉలుప వట్టు

  • కానుక లిడు. పాండు. 5. 238.

ఉలుపా యొనగూర్చు

  • నజరానా పెట్టు; బహుమతులు కానుకలు ఇచ్చు.
  • "రాజురాక కులుపా యొన గూర్చిన యట్లు...." కళా. 6. 134.

ఉలుపా లొనరించు

  • కానుక లిచ్చు. ఉల్ఫా అనే పదంనుండి వచ్చి యుండవచ్చును.
  • "విశేషవస్తు సంభావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబు జేరినన్." శుక. 1. 399.

ఉలువకట్టు

  • ఉలవ లుడికించి చేసిన చారు.
  • "నాలుగు రోజులు నీవు ఉలవకట్టు వేసుకొంటే నీశైత్యం వదలి పోతుంది." వా.

ఉల్ల కుట్టుమాటలు

  • ఎత్తిపొడుపు మాటలు.
  • "సమరమునకు బురికొల్పుచు, మము దలచిన నుల్లకుట్టుమాటల దచ్చి,త్తము లుడికించుచు బాండవ, సమితిం గడగించువా రచట నెవ్వ రొకో!" భార. ఉద్యో. 2. 242.
  • "ఈ ఉల్లకుట్టు మాటలతోనే ఆవిడ అందరినీ ద్వేషం చేసుకుంటుంది." వా.
  • రూ. ఉల్లికుట్టుమాటలు.

ఉల్లము పల్లవించు

  • సంతోషము కలుగు.