పుట:PadabhamdhaParijathamu.djvu/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉన్న______ఉన్న 212 ఉన్న______ఉన్నా

ఉన్నపట్టున ఊరక యుండు

 • తనపాటికి తాను ఉండు. ఒకరిజోలికి పోకుండా అనుట. ఇది రాయలసీమలో ఇట్లాగే ఉపయోగిస్తారు. పట్టున 'పాట్న'గా మారుతుంది.
 • "ఉన్నపట్టున నూరక యుండ వింటి పక్షపాతు లటంచును బల్క దగునె?" రాజగో. 2. 71.
 • "ఉన్నపాట్న ఊరికే ఉండకుండా ఊరిసంగ తంతా నీ కెందుకోయ్?" వా.

ఉన్న యునికిన

 • ఉన్న దున్నట్లుగా.
 • "తన యింట రాత్రి నెమ్మది, నునికి గలిగె బిదప నున్నయునికిన యడగెన్." ఉ. హరి. 6. 5.
 • చూ. ఉన్నయునికినె.

ఉన్న యునికినె

 • ఉన్నట్లుండి, హఠాత్తుగా, ఉన్న పళాన్నే అని నేడు కోస్తాప్రాంతాలలో; రాయలసీమలో 'ఉన్న దున్నట్టుగా రావలసినదిగా కోరుతున్నాను' అని ఉత్తరాల్లో వ్రాస్తారు. తత్క్షణం అనుట.
 • "ఉన్నయునికినె వెలువడ నుత్సహింప, దలచి తేనియు నిది తుది దాక నెట్లు, నెయిద నేరదు గాన నీ విందయుండి...సర్వేశు గొ;ఉపుము. బాల." కుమా. 6. 13.
 • చూ. ఉన్నయునికిన.

ఉన్నరూపు

 • కలరూపు. ఉన్న సంగతి, యథార్థము.
 • "ఇంక నెన్నండు దయ బరమేశ్వరుండు, గన్ను దెఱచునొ యని తన కున్నరూపు నెఱయ జెప్పిన విని." కుమా. 7. 19.; కాశీ. 4. 100.
 • చూ. కలరూపు.

ఉన్నవాడు

 • సంపన్నుడు.
 • "వాడు ఆ ఊళ్లో కాస్త ఉన్నవాడు." వా.
 • చూ. కలవాడు.

ఉన్నవాడూ కాదు ఊడినవాడూ కాదు

 • నిష్ప్రయోజకుడు. వాడు చచ్చినట్లూ కాక బతికినట్లూ కాక ఉన్నాడు అనుట.
 • "వాడు ఉన్నవాడూ కాదు ఊడినవాడూ కాదు. తెచ్చి పెట్తే తింటాడు. లేకపోతే పైగా తిట్లూ దీవెనలూ." వా.

ఉన్నారె యనుమాట మాత్రకైన ఎడగలదె నీకు

 • మా అస్తిత్వాన్నైనా అడిగే సావకాశం ఉన్నదా? లేదనుట. కనీసం ఆమాత్రమైనా పలుకరించడం లే దని.
 • "మమ్ము నున్నారె యనుమాట మాత్రకైన, నెడగలదె నీకు మాకొలు విపుడు గాక." కళా. 7. 19.
 • వాడుకలో 'మేమున్నా మని మాటమాత్ర మడిగేందుకు