పుట:PadabhamdhaParijathamu.djvu/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉడు____ఉడు 204 ఉడు_____ఉడు

యలై... యుడుకాఱు గాక, యలుపాల బొనుపడునట్టి చిచ్చే యిది?" భార. ఉద్యో. ఉడుకుకొను

 • ఒకరు ఎత్తిపొడిచి అపహసింపగా బాధపడు.
 • "అంత ఉడుకుకొంటున్నా వేరా? ఏదో తమాషా కంటే." వా.

ఉడుకుఘటము

 • ఘటికుడు, ఉగ్రుడు.
 • రుద్రమ. 21 పు.
 • చూ. ఉడుకుపిండము.

ఉడుకుపట్టు

 • వే డెక్కు.
 • "బడబాగ్ని బయోధి యుడుకుపట్టె ననంగన్." భాస్క. యుద్ధ. 965.
 • "అన్నం ఉడుకు పట్టింది." వా.
 • "ఉడుకుపట్టిన తర్వాత గానీ పులుసులో ఉప్పూ పులుసూ వేయరాదు." వా.

ఉడుకుపాలు

 • యౌవనము, ఉద్రేకము.
 • "ఉడుకుపాలు చిందు నో వెఱ్ఱి కూతురా." రుద్రమ. పు. 38.
 • "వాడు మంచివాడే కానీ కాస్త ఉడుకుపా లెక్కువ." వా.

ఉడుకుపిండము

 • అత్యుగ్రు డనుట.
 • "వాడా ఉడుకుపిండం. ఒక్క మాటన్నా ఓర్చుకోడు." వా.
 • చూ. ఉడుకుఘటము.

ఉడుకుబోతు

 • ఏమన్నా ఉడుకుకొనునట్టి...
 • "వాడు వట్టి ఉడుకుబోతు. తమాషాకన్నా ఏడ్చి చస్తాడు." వా.

ఉడుకుమోతుతనం

 • ఏదైనా నవ్వులాట కన్నా నొచ్చుకొనుట.
 • "అంత ఉడుకుమోతుతన మైతే ఎట్లాగే పిల్లా!" వా.
 • చూ. ఉడుకుబోతుతనం.

ఉడుగోత

 • కాపు ఉడిగిన తరువాత మిగిలినవాటిని కోసేకోత.
 • "ఎప్పుడో ఈటుపోయిన చేలో ఇంకా ఉడుగోత ఏమిటి?" వా.
 • చూ. ఉడుగోతపిందె.

ఉడుగోతపిందె

 • కాపు ఉడిగినతరువాత చెదరుగా పుట్టే నిస్సార మైన పిందె.
 • చూ. ఉడుగోత.

ఉడుతకు ఉడతాభక్తి అన్నట్లు

 • ఏదో చేత నయినంత.
 • "ఉడతకు ఉడతాభక్తి అన్నట్లు ఏదో తృణమో పణమో నేను ఇస్తాను." వా.
 • చూ. ఉడుతభక్తిగా.

ఉడుతభక్తిగా

 • చేత నయినంత. అతితక్కువైనాసరే ప్రేమతో చేస్తున్నా ననే అర్థంలో ఉపయోగిస్తారు.
 • సేతునిర్మాణంలో శ్రీరామునికి ఉడుత సాయపడిన కథ సుప్రసిద్ధం. దానిని బట్టి వచ్చినపలుకుబడి.