పుట:PadabhamdhaParijathamu.djvu/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉడి_____ఉడి 203 ఉడి_____ఉడు

ఉడికించు

  • ఎత్తిపొడుపులతో నొప్పి కలిగించు; అపహసించు.
  • "వాళ్లబావ నిమిషనిమిషానికీ దాన్ని ఉడికిస్తూ సంతోషిస్తున్నాడు." వా.
  • చూ. ఉడికిలించు.

ఉడికినమెతుకు తిని ఉలికిపడు

  • కలిగింది తిని హాయిగా ఉండక అనవసరంగా బాధపడు.
  • "వాడి కన్నీ ఉన్నా యెప్పుడూ ఏడుపే. ఉడికినమెతుకు తిని ఉలికిపడుతూ ఉంటాడు." వా.

ఉడికిలించు

  • చూ. ఉడికించు.

ఉడిగిపోవు

  • కాల మై పోయి చెట్టుచేమలు కాయలు కాయడం మానివేయు; శక్తు లుడుగు.
  • "ఉడిగిపోయిన ంరాకునుంబోలె బండ్లు డుల్లి." కవి. 4. 113
  • "నే నింకేం చేయగలను? అన్నీ ఉడిగిపోయినవి." వా.

ఉడిగి మడుగు

  • కాలం కాదని తగ్గి ఉండు. అణగి మణగు.
  • "అనిన ధౌమ్యు డిట్టు లనియె నీవత్సర, మొకడు నెట్టు లయిన నుడిగి మడిగి, సంకటముల కోర్చి..."
  • భార. విరా. 1. 142.
  • "ఉపవసింతుము గాక నే డుడిగి మడిగి." కాశీ. 7. 153.

ఉడిపోవు

  • తగ్గిపోవు.
  • "వ్యాధు లుడివోయె నపమృత్యు వద టణంగె." రుక్మాం. 1. 136.
  • "ఆసనాదులకు సమర్థమైన ప్రాయ ముడి పోవుటకు వెతపడుచు నుంటి..." కళా. 4. 149.
  • "ఉడు కన్నిటిలోన నుండుటయు లేదు నీ, వుడిపోయి యం దుండ కుండుటయు లేదు." తాళ్ల. సం. 5. 173.

ఉడివుచ్చు

  • పాడు చేయు.
  • "మునుపటి పతివ్రతలు... మాన ముడి వుచ్చుకొని రటే." హంస. 1. 127.

ఉడి వోనిపంట

  • శాశ్వత మైనది; ఉడిగిపోని దనుట.
  • "తీరని మోహాల తెందేపలు, ఊరేటి చెలమలు, ఉడివోని పంటలు." తాళ్ల. సం. 11. 11.

ఉడివోవు

  • ఉడిగి పోవు.
  • "సంపద యుడివోయి." వర. రా. అయో. పు. 485. పంక్తి. 4.
  • "పరిమళం బుడివోనివిరులు ముడిచి." పాండు. 2. 108.
  • చూ. ఉడిగిపోవు; ఉడిపోవు.

ఉడుకారు

  • చల్లారు, చల్లబడు.
  • "ఉడుకారెడినంత నెంతయున్." దేవీ. 2. 220.
  • "ఆ రాముని శ్రీపాదయుగము నూరటగా జూచి యుడుకారువాడ..."
  • వర. రా. అయో. పు. 531. పంక్తి. 3.
  • "ఈ దుస్ససేనుతను వింతలింతలు తుని