పుట:PadabhamdhaParijathamu.djvu/228

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉట్టి____ఉట్ర 202 ఉట్ర____ఉడా

"ఉదక బిందు కలాప ముట్టియుట్టి పడంగ." కాశీ. 4. 69. ఉట్టిలో పెట్టినగుమ్మడికాయవలె

 • కదలక మెదలక, దిట్టంగా.
 • "అమ్మగువ కనుగొనియెన్, ముమ్మరముగ బట్టెనామములు మే నెల్లం, గ్రమ్మికొన నుట్టి బెట్టిన, గుమ్మడికాయయునుబోలె గూర్చున్నతఱిన్." వైజ. 2. 56.

ఉట్టి పడు

 • అకస్మాత్తుగా వచ్చు.
 • "హరి ఉట్టివడి కావకున్న నొచ్చెము దేహికి హరి." తాళ్ల. సం. 9. 80.

ఉట్రవడియము

 • చిట్టి వడియము. ఈ వడియాలతో కూరచేయడం కూడా కలదు.
 • "గుడి మ్రింగెడువానికి లో నడరెడువేల్పుట్రవడియ మగు." అచ్చ. రామా. సుం. 155.
 • అన్నమూ, మసాలా దినుసులూ కలిపిన ఒక విధ మైన పలావు అని బ్రౌను. దక్షాణాదిన మసాలా దినుసులన్నీ వెల్లుల్లీ, లవంగాలు, గసాలు ఇత్యాదులు కలిపి దంచి ఉండలు చేసి ఆరబెడతారు. వానినే తుంచి తాలింపులలో, తిరగబోతలలో వాడతారు. అవే ఉట్రవడియాలు.

ఉట్రవడియముగా

 • ఉన్న పళంగానే, వెంటనే.
 • "ఇలా ఉట్రవడియంగా రమ్మంటే నేనెలా రాగలను?" వా.
 • "వాడు ఉట్రవడియంగా వచ్చాడు." వా.
 • అతి చులాగ్గా, అన్యాయంగా.
 • "వానిసొమ్ము ఉట్రవడియంగా నోట్లో వేసుకొన్నాడు." వా.

ఉట్లెక్కు

 • మూల బడు. నిత్యం ఉపయోగించని వానిని ఉట్టిపై పెట్టివేయడం అలవాటు. అందుపై వచ్చిన పలుకుబడి.
 • "ము న్నహింసా పరమో ధర్మ యని పల్కు, చదువు లుట్లెక్కెనా సార్వభౌమ.: నలచ. 3. 67.
 • చూ. ఉట్టి కెక్కు.

ఉడకవేసే దిక్కు లేదు

 • ఆడదిక్కు లేదు.
 • "వాళ్ళ తల్లిపోయినప్పటినుంచీ వాళ్ళింట్లో ఉడకేసేదిక్కు లేక మహా అల్లాడి పోతున్నారు." వా.

ఉడకాడించు

 • క్షోభ పెట్టు, కలత పెట్టు. చిత్తూరు ప్రాంతంలో ప్రచురంగా ఉన్నది.
 • "ఆ పిల్ల లంతా నన్ను ఊరికే ఉడకాడిస్తున్నారు." వా.
 • చూ. ఉడ్డాడించు.

ఉడాములమీద వెళ్లు

 • అంచెలమీద పోవు.