పుట:PadabhamdhaParijathamu.djvu/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉట్టి_____ఉట్టి 201 ఉట్టి_____ఉట్టి

ఉట్టి గట్టుకొని ఊరేగు

  • ఎందుకోసమో ఉబలాటపడుతూ ఎప్పు డెప్పుడా అని ఉండు. వాడుమాత్రం అనుభవించే దేమున్నది. అన్న అర్థంలోనూ ఉపయోగించడం కలదు.
  • "వా డేదో తానే పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు కాగల నని ఉట్టిగట్టుకొని ఊరేగుతున్నాడు. కానీ డిపాజిట్టు కూడా దక్కేట్టు లేదు." వా.
  • "వా డేమి ఉట్టిగట్టుకొని ఊరేగబోతాడా?" వా.
  • చూ. ఉట్టి గట్టుక వ్రేలు.

ఉట్టి గట్టుకొని వ్రేలు

  • దేనికోసమో కాచుకొని ఉవ్విళ్లూరు.
  • "నిశ్చలతన్ వ్రేలెద వుట్టిగట్టుకొని." పాండు. 5. 211.
  • "ఎప్పుడో తనకు గుఱ్ఱపు పందాలలో తప్పక బహుమతి వస్తుంది అని వాడు ఉట్టిగట్టుకొని వ్రేలాడుతున్నాడు." వా.
  • చూ. ఉట్టిగట్టుకొని ఊరేగు.

ఉట్టిచీల

  • రెండుప్రక్కలా తల ఉన్న చీల. శ. ర.

ఉట్టిచేర్లు తెగు

  • అధ:పతనము చెందు.
  • "ఉట్టిచేర్లన్ని యుందెగె నుదిలపడుచు, డొంటి దర్పంపుటుయ్యెల దోగగలవొ, వ్యసనపర వయి నీకు నీవ యిక నాకు, భార్య వగుదువొ ప్రార్థించుపనియు లేదు." రామకథా. యుద్ధ. వూ. 4. 329.

ఉట్టిపడు

  • పొంగిపొరలు, విస్పష్ట రూపంలో కానవచ్చు. ఇలాంటి కొన్ని అర్థాలలో వాడుకలో ఉన్నది.
  • "వాని ముఖంలో బ్రహ్మ వర్చస్సు ఉట్టిపడుతూ ఉంటుంది." "ఆకావ్యంలో రసం ఉట్టిపడుతూ ఉంటుంది." "వీడి మొహం వాళ్ల నాన్న ఉట్టి పడ్డట్టే ఉంది." ఇత్యాదు లూహ్యములు.
  • "బ్రహ్మతేజం బుట్టి పడునెమ్మొగము ఠీవి, రాకాశశాంకగౌరవము దెల్ప." పెద్దాడ. శకుం. 253.
  • "ఆ బాలుర గృప యుట్టిపడగ జూచి." కళా. 6. 159.

ఉట్టిపాటుగా

  • హఠాత్తుగా.
  • "ఉట్టిపాటుగా ప్రయాణం కావలసి వచ్చింది." వా.

ఉట్టిపాటున

  • హఠాత్తుగా.
  • "ఉట్టిపాటున బయలుదేరాను." వా.

ఉట్టిపై చెరలాటము

  • నిప్పుతో చెలగాటము వంటిది. ఉట్టిమీద నిలిచి ఏమాత్రం కదిలినా కింద పడతారు.
  • తాళ్ల. సం. 11. 3 భా. 5.

ఉట్టి యుట్టి పడు

  • ఎగి రెగిరిపడు.