పుట:PadabhamdhaParijathamu.djvu/220

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉండ____ఉండ 194 ఉండ____ఉంప

ఉండచీట్లు వేయు

 • లాటరీ వేయు.
 • "వా ళ్లిద్దరికీ సమానంగా ఓట్లు వచ్చేసరికి ఉండచీట్లు వేయవలసి వచ్చింది." వా.

ఉండ బట్టదా ?

 • కాలక్షేపం కాలేదా, ఊరకే ఉండ లేవా ?
 • "ఒక టంటె ఒక టాడి ఉండబట్టదొ కాని." తాళ్ల. సం. 3. 537.
 • ఇలాంటి సందర్భంలో ఇది నేటికి రాయలసీమలో వినవస్తుంది.
 • "ఏం ఉండబట్టదా సాపోడా! పడే సకం ఆడతావు." వా.

ఉండబట్ట లేక

 • ఊరక ఉండ లేక; అనవసరముగా అనుట.
 • "ఉండబట్టలేక వాళ్లింటి కెళ్లి అన్నిమాటలు అనిపించుకొన్నాను?" వా.
 • "ఉండబట్ట లేక ఆ నాటక సమాజం అనిపెట్టి వాడు పాడై పోయాడు." వా.
 • "ఉండబట్టలేక ఆమాట అని నెత్తిమీదికి తెచ్చుకొన్నాడు." వా.

ఉండలక్రోవి

 • వడిసెల.

ఉండవిలు

 • వడిసెల.
 • చిన్న పంగలకఱ్ఱకు చర్మపు వారో తాడో కట్టి, దానిలో గట్టిగా ఎండబెట్టిన మట్టి ఉండలు పెట్టి పక్షులు మొదలైన వానిని కొడతారు నేటి దీని రూపం 'ఉండేలు'
 • "నీదు తను వుండవిలు సేసి నెఱకువేయు, రతివరుడు హారగుళికల రాజ హంసు." నైష. 2. 97.
 • "పిల్లకాకి కేం తెలుసు ఉండేలుదెబ్బ." సా.

ఉండసురియ

 • ఒక విధ మైనకత్తి.
 • "కొండగొఱియల నుండసురియల... చెండాడుచు." రా. వి. 3. 65.

ఉండుకొను

 • ఉండు.
 • "అవ్వనట దొలంగ జేయుటయు, వాస్తవ మై యిటు లుండుకోగ..." కాళిందీ. 2. 211.
 • వైదిక వృద్ధులలో ఈమాట నేటికీ ఉన్నది.
 • "వా డా ఊళ్లో ఉండుకొంటూ ఉన్నాడు" "ఉండుకొన్నవాడై." వా.

ఉండూరు

 • స్వగ్రామము.
 • "వానికి ఉండూళ్లో యిల్లు లేదు. పొరుగూళ్లో పొలము లేదు." వా.

ఉంపడము

 • ఉంపుడు ఉంచుకొనుట; ఉంపుడుకత్తె.
 • "ఆపిల్లను వాడు ఉంపడం ఉంచుకొన్నాడు." వా.
 • "ఇది వాడికి ఉంపడం." వా.
 • చూ. ఉంపుడుకత్తె.