పుట:PadabhamdhaParijathamu.djvu/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉంగ____ఉంచు 193 ఉంఛ____ఉండ

ఉంగరాలచేతి మొట్టికాయ

  • ధనికుని దూషణ; దండన. అది తిట్టే అయినా ధనికుడన్నా డని సరిపెట్టుకొనువాని విషయంలో ఎత్తిపొడుపుగా అనుమాట.
  • "నేను ఒకమాటంటే అంత కస్సు మని వచ్చావే? మఱి ఆరంగయ్య అన్నిమాట లంటే నోరు మూసుకొని కూర్చున్నావుగా. మఱి అది ఉంగరాల చేతి మొట్టికాయగదా. బాగానే ఉంటుంది." వా.

ఉంగిడిగొనినట్లు

  • ఉంగిటిరోగము పొందినట్లు.ఉంగిడి సామాన్యంగా పశువు నాము తిన్నప్పుడు వచ్చే వ్యాధికే వాడుతారు. కాశీ. 2. 138.

ఉంగిడిగొను

  • ఉంగిడి అను పశు వ్యాధి వచ్చు.
  • "ఉంగిడిగొన్నభంగి." కాశీ. 2. 138.

ఉంగుంగ

  • ధ్వన్యనుకరణము. శిశువు చిన్నప్పుడు అనుమాట.
  • చూ. ఉంగే ఉంగే.

ఉంగే ఉంగే

  • చూ. ఉంగుంగ.

ఉంచుకొను

  • 1. పెట్టుకొను.
  • "ఉపనిషత్కాంతల నుంచుకొనిరి గాని." పాణి. 5. 14.
  • 2. తన అధీనములో ఒక పరస్త్రీని ఉంపుడుకత్తెగా ఉంచుకొను.
  • "దానిని అత డుంచుకొన్నాడు." వా.

ఉంఛవృత్తి

  • పొలాల్లో కళ్లాల్లో రాలిన గింజలను ఏరుకొని, వాటితోనే జీవించు జీవనము.

ఉంటకట్టు

  • చాలకాల మైనప్పుడు పిండీ మొదలయినవి. ఉంట కట్టడం అలవాటు.
  • "ఆగోధుమపిండి ఉంట కట్టింది." వా.
  • చూ. ఉండకట్టు.

ఉంటగాలము

  • సీసపుగుండు కట్టిన ఒక రకమయినగాలము. హంస. 4. 184.

ఉంటాను!

  • ఎవరి నైనా సాగనంపుతున్నప్పుడు నేనిక సెలవు తీసుకొంటా నని గృహస్థు మొదలగువా రనుమాట.
  • "మఱిక ఉంటాను. వెళ్ళగానే ఉత్తరం వ్రాయండి." వా.
  • చూ. నిలుస్తాను.

ఉండకట్టు

  • చూ. ఉంటకట్టు.

ఉండగ్రోవి

  • పట్టుకొనుచోట ఉండగా ఉన్న చేతికఱ్ఱ. శ. ర.