ఈ పుట ఆమోదించబడ్డది
ఉదాహృత గ్రంథ సంకేత సూచిక.
| సంకేతము | గ్రంథ నామము | కవినామము. |
| అచ్చ, అచ్చ, రామా | అచ్చ తెనుగు రామాయణము | కూచిమంచి తిమ్మకవి. |
| అనిరు. అని | అనిరుద్ధచరిత్రము. | కనుపర్తి అబ్బయామాత్యుడు. |
| అ. మ. క అష్టమ. క | అష్టమహిషీ కల్యాణము. | తాళ్లపాక చిన్నన్న |
| అలుగు | అలుగురాజు | ఏటుకూరి వెంకటనరసయ్య. |
| అహల్యా | అహల్యా సంక్రందనము. | సముఖము వెంకటకృష్ణప్ప నాయకుడు. |
| ఆం. నా | ఆంధ్రనామసంగ్రహము | పైడిపాటి లక్ష్మణకవి. |
| ఆం. భా. ఆంధ్ర. భా | ఆంధ్రభాషార్ణవము | నుదురుపాటి వెంకన |
| ఆం. వా | ఆంధ్రవాచస్పత్యము | కొట్ర శ్యామలకామశాస్త్రి |
| ఆనంద | ఆనందరంగ రాట్ఛందము | కస్తూరి రంగకవి |
| ఆము | ఆముక్తమాల్యద | శ్రీ కృష్ణ దేవరాయలు |
| ఆశ్విన. మా | ఆశ్వినమాహాత్మ్యము (తె. జా.) | |
| ఇందు | ఇందుమతీపరిణయము | కుమారధూర్జటి |
| ఊ. రా ఉత్తర. రామా | ఉత్తరరామాయణము | కంకంటి పాపరాజకవి |
| ఉద్భ | ఉద్భటారాధ్యచరిత్రము | తెనాలి రామలింగకవి |
| ఉషా | ఉషాపరిణయము | పసుపులేటి రంగాజమ్మ |
| ఉ. హరి. | ఉత్తరహరివంశము | నాచన సోమన |
| ఎడ్వ. నాట. | ఎడ్వర్డు నాటకము (తె. జా.) | |
| ఒంటి, శత | ఒంటిమిట్ట రఘువీర శతకము | రాయకవి తిప్పయ్య |
| కకు. (కకుత్థ్స) | కకుత్థ్సవిజయము | మట్ల అనంత భూపాలుడు |
| కన్యా. శు. | కన్యాశుల్కము | గురజాడ అప్పారాయకవి |