పుట:PadabhamdhaParijathamu.djvu/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆశ______ఆస 133 ఆస______ఆసు

ఆశపాతకం మనిషి

 • దురాశాపరుడు.
 • "వాడు ఒట్టి ఆశపాతకం మనిషి. ఏ మిచ్చినా వానికి తృప్తి అ నేది ఉండదు." వా.

ఆశాశల ద్రిప్పు

 • అటు ఇటు, ఇటు అటు త్రిప్పు, ఆశ పెట్టి త్రిప్పు.
 • "ఏయ విచారించిన దూటి దాటుకొని త న్నాశాశలం ద్రిప్పి." కా. మా. 3. 60.

ఆషాఢభూతి

 • హితవంచకుడు.
 • అమాయకంగా కనబడుతూ ద్రోహం చేసేవాడు.
 • పంచతంత్రంలోని కథపై వచ్చినపలుకుబడి.

ఆషామాషీ

 • కులాసాకబుర్లు.
 • "ఏదో ఆషామాషీ గా మాట్లాడుకొంటూ ఉంటే నీ ప్రస్తావన వచ్చింది. నే నేదో ఒక మంచిమాటే వేశాను మరి!" వా.

ఆసపడు

 • ఆసించు.
 • "అతని నాసపడి పలుకుచుండిరి." భార. ద్రోణ. 1. 17.
 • "పరకాంతలకు నాసపడనివాడు." జైమి. 3. 40.

ఆసవిఱుపు

 • ఆశాభంగము కలుగజేయునది.
 • "యాచకకోటుల కాసవిఱుపు." శుక. 3. 20.

ఆస సేయు

 • ఆశించు.

                "వెండియుం గడుసరి దానవులు మిసిమి
                 గలపసిడి కాసచేసి పడద్రోసి గాసిం
                 బఱచినప్రాసాదంబులును."
                                       ఉ. హరి. 1. 53.

 • "అల్లన దెమలింప నాస సేయుటయు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 978.

ఆసాన నఱ్ఱాడు

 • మిక్కిలి ఆశతో వేకారు.
 • "పరువంబు గాక చొప్పడని మామిడి తేనె, లాన నాసాస నఱ్ఱాడునవియు!" పారి. 3. 51.

ఆసాసల

 • ఎక్కువ ఆశతో.
 • ఈ ద్విరుక్తి ఆధిక్యమును తెలుపును.
 • "బ్రమసి యాసాసల రసవాదము లొనర్చి, ప్రకటించి రాజపట్టికలు దీర్చి." శుక. 3. 372.

ఆసాంతము

 • పూర్తిగా.
 • "ఆవల నెత్తివత్తు రాసాంత మూడ్తురు." నాయకు. పు. 108.

అసీమాంతం చేయు

 • సాగనంపు.
 • పొలిమేరదాకా సాగనంపే అలవాటుపై వచ్చినపలుకుబడి.

ఆసువోసిన కండెవలె

 • ఒకచోట నిలువక.