పుట:PadabhamdhaParijathamu.djvu/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆవ_____ఆవు 132 ఆవు_____ఆశ

ఆవలిమో మిడు

 • అయిష్టము సూచిస్తూ మాఱు మొగము పెట్టు.
 • "ఆవలిమో మిడి తా గ్రోలె." విప్ర. 2. 68.
 • చూ. మాఱుమో మిడు.

ఆవిడ

 • భార్య; ఆమె.
 • "మా ఆవిడ దీనికి సుతరామూ ఒప్పుకోవడం లేదు." వా.
 • " మీ ఆవిడతో చెప్తాను ఉండండి. మీ రేమో మహా ఖర్చు పెట్టేస్తున్నారు." వా.
 • "ఆవి డెవరు?" వా.

ఆవుగోవు

 • సాధువు.
 • "ఆయన దేముంది పాపం ! ఆవుగోవు."

ఆవును చంపి చెప్పులు దానం చేయు

 • అల్ప మైన మంచిపని కోసం మహాపాపానికి ఒడిగట్టు.
 • "వాడు ఆవును చంపు చెప్పులు దానం చేస్తాడు. ఏమి లాభం?" వా.

ఆవురు మను

 • వాపోవు.
 • కొత్త. 303.

ఆవుర్న నోరు దెఱచు

 • ఆవురు మని నోరు తెఱుచు. క్రీడా. పు. 73.

ఆవులాంటివాడు

 • సాధువు.
 • "ఆయన కే పాపం తెలియదు. ఆవులాంటివాడు." వా.

ఆవులింతలు వచ్చు

 • చూ. ఆవలింపులు వచ్చు.

ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్ట గల

 • అతినిశితబుద్ధి అయిన; ఎదుటి వానిసత్తాసారం గ్రహించగల.
 • "వాడు ఆవులిస్తే ప్రేవులు లెక్క పెట్ట గలవాడు. వాడిదగ్గర మన ఆట లేవీ సాగవు." వా.

ఆవులు తలచినచోట పూరి మొలిచినట్లు

 • చక్కని సౌకర్యం ఏర్పడిన దనుట. ఆవులు మఱొక చోటికి వెళ్ళకుండా అనుకున్న చోటనే పచ్చిక మొలిస్తే మఱిం కేమి?
 • పండితా. ప్రథ. పురా. పుట. 387.

ఆవులువారు

 • అలసిపోవు, ఆవులింతలు వచ్చు స్థితికి వచ్చు.
 • "ఆవులువారెడిమేని అలుపులతోడ." తాళ్ల. సం. 3. 403.

ఆవేశకావేషాలు

 • కోపోద్రేకాలు. జం.
 • "ఆవేశకావేషాలు పెచ్చు పెరిగి ఆఊళ్లో ఖూనీలు జరిగా యట." వా.

ఆశకు మట్టు లేదు.

 • ఇంత ఆశ అయితే ఎలా అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • బాణాల. కాళ. 10.