పుట:PadabhamdhaParijathamu.djvu/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆళు_____ఆవ 131 ఆవ______ఆవ

ఆళులపొల్లలు

 • ఆడు పోడుములు, స్త్రీ రీతులు.
 • "పొడువు నూడ మగల పొల్లలు నాళుల పొల్లలును నిజంబపోలె నుండు." కుమా. 11. 46.
 • చూ. మగలపొల్లలు.

ఆవంత

 • కాసంత, కొంచెం అనుట.
 • "ఆవంత శంక లేక." భార. కర్ణ. 3. 288.

ఆవగింజలో అరభాగ మైనా

 • ఏకొంచెం కూడా.
 • "ఆవగింజను నరభాగ మైన గాదు." పాణి. 2. 11.

ఆవగింజలో అరసగము కాలేదు

 • కొంచెముకూడా కాలేదు.
 • ఆవగింజ అతి చిన్నది.
 • "ఇంకా ఆవగింజలో అరసగం కూడా కాలేదు. అప్పుడే ఏదో కొంప మునిగి పోతుం దని గోల పెడతా వేమిటోయి!" వా.

ఆవటము చేయు

 • అమర్చు, పొందుపఱచు.
 • "వర దాభయంబు లావటము చేసి." పాండు. 2. 229.

ఆవడ

 • పెరుగువడ.

ఆవ తాగిన పసరమువలె

 • పిచ్చెత్తినట్లు అనుట.
 • చూ. ఆవ ద్రావినట్లు.

ఆవ దిన్నట్లు

 • కడుపులో ఆవాలు పోసు కొన్నట్లు.
 • ఎక్కువ దిగులునూ శోకాతి రేకాన్నీ తెలియజేసే పలుకుబడి.
 • "ఆవదిన్నట్లు ఖేదావహం బయ్యె."
 • వర. రా. అయో. పు. 380. పంక్తి 6.

ఆవ ద్రావినట్లు

 • కడుపులో చేయి వేసి కలచినట్లు.
 • ఆవాలు నూరి త్రాగితే కడుపులో విపరీత మైనఆరాటం కలుగుతుంది.
 • "ఆవ ద్రావిన జోక నటమటిల్లు." రాధి. 3. 120.
 • చూ. ఆవతాగినపసరమువలె.

ఆవల నీవలన్

 • అక్కడక్కడా, అక్కడా యిక్కడా.
 • వాడుకలో అక్కడా ఇక్కడా అనేరూపమే నిలిచి ఉంది.
 • "ఏనావల నీవలన్ విని." విక్ర. 5. 15.
 • "వా డేదో బాగా సంపాయించా డని అక్కడా యిక్కడా అంటూండగా విన్నాను." వా.

ఆవలింపులు వచ్చు

 • విసుగెత్తు.
 • "వాడి ఉపన్యాసం వింటూంటే నాకు ఆవలింపులు వస్తున్నాయి." వా.
 • చూ. ఆవులింతలు వచ్చు.