పుట:PadabhamdhaParijathamu.djvu/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆభా_____ఆమ 122 ఆమ_____ఆము

ఆభాస్యుడు

  • అపహాస్యపాత్రుడు.
  • అనగా పనికిరానివాడు అనుట.
  • "ఇదేమి సిద్ధి యాభాస్యున కేల చొప్పడు." విక్రమ. 3. 7.

ఆభిచారంబు వేల్చు

  • ఒకరికి చెరుపు సేయుటకై హోమాదులు చేయు.
  • "భూరిక్రియల నాభిచారంబు వేల్చ." పండితా. ప్రథ. వాద. పుట. 688.

ఆభ్యంతరరతి

  • బాహ్యరతికి భిన్నమైన సంభోగము. కుమా. 9. 152.

ఆమంత్రణము వడయు

  • సెలవు తీసుకొను, పొందు.
  • "అతనిచే నాలింగితుండై యామంత్రణంబు వడసి." భాగ. స్క. 1. 233.

ఆమంత్రణము సేయు

  • పిలుచు, సెలవు తీసికొను.
  • "ఆమంత్రణంబు సేసి యంతర్హితుండయ్యె." భార. అశ్వ. 3. 155.

ఆమటపదిట

  • పదామడల దూరంలో.
  • ఇంతపరిధిలో ననుట - దీనిని అనేకరకాలుగా అంటారు. ఆమడ అంటే పదిమైళ్లు. నేటికీ ఈ లెక్క ఉన్నది.
  • "ఆమట పదిట లింగార్చకుం డనెడు నామంబు వినగ రా దేమి కర్మంబొ." బస. 6 ఆ. 155 పుట.
  • "పదామట్లో అంత పండితుడు లేడు."
  • "చుట్టూ పదామడల్లో స్టేషను లేదు."
  • "పది ఆమట్లో పోస్టాఫీసు లేదు. వా.

ఆమని బుగబుగలు

  • అస్థిర మైనవి.
  • వసంతకాలములో మాత్రమే వాసనలు గుబుల్కొను నని వాచ్యార్థము.
  • పాండు. 3. 72.

ఆమవడ

  • పెరుగువడ. పెరుగు గారె.

ఆమశ్రాద్ధం

  • బియ్యం పిండి వగై రాలతో - అన్నంతో వంటతో నిమిత్తం లేకుండా చేసే శ్రాద్ధం.

ఆమాటా యీమాటా

  • ఒక నిర్దిష్ట కార్యాన్ని సూచించేవి కాక లోకాభిరామాయణంగా మాట్లాడుమాటలు.
  • "వాడు ఆమాటా యీమాటా మాట్లాడి పోయాడే కాని ఈ సంగతే చెప్పలేదే?" వా.
  • "మేము ఆమాటా ఈమాటా మాట్లాడు కొంటూండగా నీ సంగతీ వచ్చింది."
  • "ఆమాటా యీమాటా మాట్లాడి వాడు నన్ను బుట్టలో వేశాడు." వా.
  • "ఆమాటా యీమాటా మాట్లాడి వకిటిదాకా వెళ్లి ఆతరవాత అసలు విషయం బయట పెట్టాడు." వా.

ఆము కవియు

  • పొగ రెక్కు.
  • "ప్రామిన్కు నెత్తాము లాముకవియు." పాండు. 2. 152.