పుట:PadabhamdhaParijathamu.djvu/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆజ్ఞ____ఆట 112 ఆట_____ఆట

ఆజ్ఞ వెట్టు

 • ఆజ్ఞాపించు.
 • "ఆజ్ఞ వెట్టించి చే తడియాఱ దిపుడు." కా. మా. 1. 54.

ఆజ్ఞ సేయించు

 • ఆజ్ఞానువర్తిని చేయు.
 • "శూర్పణఖ వచ్చుటయు ఆ పొలతిని బట్టి యాజ్ఞ సేయింప."
 • వర. రా. బా. పు. 16 పంక్తి 2.

ఆండ్రెబ్బతనం

 • పెంకెతనం, పిల్లలు చేసే అల్లరి అని వావిళ్ళ. అహం అనే అర్థంలో పెద్దాపురం ప్రాంతంలో వాడతా రటి.

ఆట ఆడించు

 • వేధించు.
 • "వా డేదో మహా మిడిసిపడుతున్నాడు. వాణ్ణి ఒక్క ఆట ఆడించి వదిలి పెడతాను." వా.

ఆట కట్టు

 • పని ముగియు.
 • చదరంగం ద్వారా వచ్చిన పలుకుబడి.
 • రాజు మహా చెప్పగానే ఆట కట్టిపోతుంది.
 • "మహా మిడిసిపడుతూ ఉండేవాడు. ఆ దావాతో వాడి ఆట కట్టింది.: వా.
 • "ఏ మనుకున్నావు? నా తడాఖా. మూడు నిమిషాల్లో వాడి ఆట కట్టించేస్తాను చూడు." వా.

ఆటకూటమ్ములు

 • నటకుల సంఘాలు, నాటక సంఘాలు.
 • పండితా. ద్వితీ. పర్వ. పుట. 470.

ఆటది

 • 1. ఆడుది.
 • 2. చిన్నపిల్ల, ఆటలాడు కొనునది.
 • ఆడునది వేశ్య, నట్టువరాలు.

              "ఆటదాన నబల నైన నే నించుక,
               యలిగి చూచుడును భయమున దలరు.
               దుగ్రు నుగ్రలోచనోద్భూతవహ్నికి,
               నెదిరి నిలువ నీకు నెంత కొలది."
                                       కుమా. 4.74.

 • ఇక్కడ ఆడదానను అన్న అర్థంలో ఉన్న ట్లున్నది.
 • "ఆటదానికి వశ మమ్మ యీ మేటి కోటలు దాట..." గౌర. హరి. ద్వి. 2407.
 • "ఆటదానిని జంపు టవినీతి యనక."
 • పండితా. ప్రథ. పురా. పుట. 285.

ఆట పట్టించు

 • ఏడిపించు, శాస్తి చేయు.
 • "వాడి ఆట పట్టిస్తాను. ఏ పెద్ద మనిషి అడ్డు వస్తాడో తెలుస్తుంది." వా.

ఆటపట్టు

 • స్థానము.
 • "రామేశ్వరతీర్థము కఱకంఠున కాట పట్టు." భీమ. 3. 155.

ఆటపాటలు

 • ఆటలు, పాటలు. జం.
 • "అట్టి హరికీర్తనములు నీ కాటపాట, లిందిరాప్రాణవిభుడు నీ కిష్టదైవము." నలచ. 2. 27.