పుట:PadabhamdhaParijathamu.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అస్థు____ఆక 106 ఆక_____ఆక

  • అస్తవ్యస్తానికి జానపదరూపం కావచ్చును.

అస్థు లరిగేటట్లు

  • ఎముకలు విరిగేటట్లు.
  • "అస్థు లరిగేటట్లు పనిచేసినా అక్కడి కక్కడికే సరిపోవడం కష్టంగా ఉంది." వా.

అస్మాకం

  • ఉంపుడుకత్తె.
  • వైదికులు మాత్రమే ఉపయోగించేమాట.
  • 'అస్మాకం సహ కుటుంబానాం' ఇత్యాది సంకల్పంలోని వాక్యంలోని భాగం.ఇతర వైదిక పరిభాషలవలెనే ఇది తర్వాతి పదానికి - కుటుంబానికి సూచక మయినది.
  • ఆ కుటుంబమే ఉంపుడుకత్తెగా నెమ్మదిగా మారినది.

అహమించు

  • నేనే అన్నిటినీ చేయగలను అని ధీమాతో విజృంభించు.
  • "లెక్కకున్ మిగిలినసేన నొక్క డహమించి వధించుట." జైమి. 2. 48.

అహోరాత్రస్య

  • ఎల్ల ప్పుడూ.
  • "అహోరాత్రస్య వాడి కదేపని. వేరే పని లేదు." వా.

ఆకను బెట్టు

  • కష్టపెట్టు, అడ్డగించు.
  • "తద్భటపరంపర యాకను బెట్టి యుండగన్." విప్ర. 5. 24.

ఆకతాయి

  • శుంఠ.
  • "వాడు వట్టి ఆకతాయి. చదువూ లేదు, సామూ లేదు." వా.

ఆకత్రాడు

  • కవ్వమునకూ స్తంభమునకూ కట్టుత్రాడు.
  • "ఆహవప్రవహాదు లగుమారుతంబులు తగులగట్టిన యాకత్రాళ్లు కాగ." భీమ. 4. 59.

ఆకపెట్టు

  • అడ్డగించు.
  • "నభస్థలి నంబుధి నాకపడక చరి యింపక." భాస్క. కిష్కిం.

ఆకసము తూటు పొడుచుక యైన చనును

  • ఏవిధముగా నైనను తప్పించుకొని పోవును.
  • "ఆకసము తూటు వొడుచుక యైన జనును." హంస. 4. 198.

ఆకగొను

  • నిరుద్ధు డగు.
  • "ద్రోణు బాణవృతు జేయ నతం డాక గొనక యతని ధనువు వ్రే కని భల్లమున ద్రుంచి."
  • భార. ద్రోణ. 1. 201.

ఆకగొలుపు

  • ఆకర్షించు, నిలబెట్టు.
  • "మడుగు మాసిన నైన మగువ పిఱుందు సో,యగము చూపఱ చిత్త మాక గొలుప."
  • ఉ. హరి. 1. 57.