పుట:PadabhamdhaParijathamu.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అసి_____అస్త 105 అస్త_____అస్తో

అసివోవు

  • వ్యర్థ మగు.
  • "అసి వోవ వచ్చునా యసివోక యనుచు." గౌర. హరి. ద్వి. 2608.

అసురుసు రగు

  • "ముసురుకొను జరభరంబున, నసురుసు రై యున్న మమ్ము నడికించితిని..." మను. 4.
  • చూ. అవురుసవు రగు.

అసూర్యంపశ్య

  • ఎండక న్నె ఱుగనిది.
  • చాలా సుకుమారి అనుటకు దీనిని విరివిగా ఉపయోగిస్తారు. రాజస్త్రీలను అసూర్యంపశ్య లని అనేవారు.

అస్థలిత బ్రహ్మచారి

  • బ్రహ్మచర్య వ్రతమును అక్షరాలా అనుష్ఠించేవాడు.

అస్తమానం

  • ఎల్లప్పుడూ.
  • సూర్యాస్తమాన మ య్యే వరకూ అనుటలో మిగిలి అదే అర్థాన్ని సూచించేమాట.
  • "అస్తమానం ఇదే గొడవ పెట్టుకొని కూర్చుంటే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారనుకున్నావు?" వా.

అస్తమానూ

  • ఎల్ల ప్పుడూ.
  • "అస్తమానూ ఈ వెధవ గొడ వేమిటి?" వా.
  • చూ. అస్తమానం.

అస్తవ్యస్తపు మాటలు

  • అందిక పొందిక లేనిమాటలు.
  • "అస్తవ్యస్తపుమాటలాడ గొందఱు." భార. సౌప్తి. 1. 197.

అస్తవ్యస్త మగు

  • తలక్రిందు లగు.
  • "దు స్తరమును నగు నస్త, వ్యస్తంబగు నేని నాకు వగపు గదిరెడున్."
  • భార. ద్రోణ. 2. 303.

అస్తుబిస్తుగా

  • చాలి చాలక.
  • కొత్త. 276.

అస్తువి స్తగు

  • సతమత మగు, బాగా అలసి పోవు.
  • త్రివేణి. 68 పు.

అస్త్రశస్త్రా లుడుగు

  • బల ముడుగు.
  • "అక్కడికి పోయివచ్చేటప్పటికి అస్త్రశస్త్రాలు ఉడిగి పోయాయి." వా.

అస్త్రసన్యాసము చేయు

  • పని మానివేయు
  • భీష్ముడు శిఖండిముఖం చూచి అస్త్రసన్యాసం చేయుటపై యేర్పడినపలుకుబడి.
  • "ఈ వయసులోనే అస్త్రసన్యాసం చేస్తే ఎట్లానోయ్!" వా.

అసాధ్యపు పిండం

  • గడసరి.
  • "వాడు చాలా అసాధ్యపుపిండం." వా.

అస్తాబిస్తం

  • అర్లుమర్లు.