పుట:PadabhamdhaParijathamu.djvu/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అస______అసా 104 అసి______అసి

అసలు చొచ్చి అలయు

 • తెలిసి తెలిసి బాధలో పడు.
 • తాళ్ళ. సం. 11. 3 భా.74.

అసలు మసలు

 • సమాన మగు, ఎసక మెసగు లాంటిది.
 • "కిసలయచ్ఛవి పునరుక్తి నసలు మసలు." పాండు. 1. 131.

అసవు సవు లగు

 • అదవదలగు. హర. 3. 10.

అసహాయశూరుడు

 • ఏ సహాయమూ లేకనే పోరాడగలవాడు అనుట.
 • పోరులోనే కాక దేనిలో సమర్థు డైనా దీనిని ఉపయోగిస్తారు.
 • "వాడు ఏ దేశానికి పోతే నేం? ఏ ఊరికి పోతే నేం? జయించికొని రాగలడు. అసహాయశూరుడు మఱి," వా.

అసావాదిత్యో బ్రహ్మ గా

 • ఏదో సూటిగా చెప్పక తిరుగుళ్లుగా చెప్పు.
 • సంధ్యావందనంలో 'అసా వాదిత్యో బ్రహ్మ' అంటూ తలచుట్టూ చెయ్యి తిప్పుతూ నీళ్లను చల్లుటపై వచ్చిన పలుకుబడి.
 • "ఈ అసావాదిత్యో బ్రహ్మ అంతా నాకు సరిపడదు. ఇస్తే ఇస్తా నను, లేకుంటే లే దను." వా.

అసికోతలు కోయు

 • కడికండలుగా చేయు.
 • చిన్న చిన్న ముక్కలుగా నఱుకు.

        "నెట్టన మొల నున్న నెఱికత్తి దిగిచి,
         కొన్నింటి ముక్కులు కొన్నింటీ
         చెవులు, గొన్నింటి చెక్కులు గోతలు
        వెట్టి, యసికోతలుగ గోయ."
                           ద్వి. హరిశ్చ. పూ. 2040.

అసిధారావ్రతము

 • అతికష్ట మైనది.
 • కత్తివాదరపై నడచుటవంటి దనుట.
 • "వానితో వ్యవహరించడ మంటే అసిధారావ్రతమే." వా.

అసిమిలోని దొకటి, అమ్మెడి దొకటి

 • ఒకటి ఉంటే ఒకటి పైకి చెప్పు.
 • "అసిమిలోని దొకటి యమ్మెడిదొక్కటి, నీ చరిత్ర మెల్ల నేడు తెలియ." హరి. 2. 151.
 • చూ. అమ్మే దొకటి అసిమిలో దొకటి.

అసియాడు

 • అటూ ఇటూ తీగవలె వంగు, ఊగు, అసి = కత్తి - కూడా అలా కదిలించినప్పుడు అసియాడుతుంది. అందుపై వచ్చినమాట కావచ్చును.
 • "కానుదీగ లసియాడ." భీమ. 5. 5. 15.
 • పాండు. 3. 77.
 • వుజయ. 1. 126.