పుట:PadabhamdhaParijathamu.djvu/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అవ_____అవ 99 అవ_____అవి

అవమానపడు

 • అవమానము పొందు.
 • "అంత అవమానపడి వానింటికి మఱీ వెళ్ళడ మెందుకు?" వా.

అవమానపఱచు

 • అవమానించు.
 • "ఒకరిని అవమానపఱచడంవల్ల వచ్చే లాభం?" వా.

అవమాన పెట్టు

 • అవమానించు.

అవల నే నున్నాను

 • మిగత పని అంతా నేను చూచుకుంటాను లెమ్మని అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "ఇందులకై యే యడ్డము వలవ దవల నే నున్నాడన్." ఆము. 2. 98.
 • "అవతల నే నున్నానుగా. అదంతా నేను చూచుకుంటాను." వా.

అవశాత్తుగా

 • అకస్మాత్తుగా.
 • కాశీయా. 322.

అవసరనై వేద్యం

 • ఏదో కాస్త కడుపునకు వేయుట కగునది.
 • నై వేద్యం స్థానే అది లేనప్పుడు ఏదో ఒకటి పెట్టుటపై వచ్చినపలుకుబడి.
 • "ఇప్పటికి ఈ అవసర నై వేద్యం కానివ్వండి. ఊరికి వెళ్లేటప్పటికి పొద్దు పోతుంది." వా.

అవసర మిచ్చు

 • దర్శన మొసగు.
 • "అవసరం బిచ్చి శివుడు బ్రహ్మాచ్యు తాదిదేవతల గారవించె." కాశీ. 7. 222.
 • భాగ. అష్టమ. 220. ప.

అవసరములవారు

 • ప్రతీహారులు.
 • "మాఱాక దెల్పు డేమఱక రాజునకు, జను డన్న విని యవసరములవారు."
 • వర. రా. బా. పు. 203. పంక్తి 11.

అవసర వేళ

 • పూజావేళ.
 • పండితా. ప్రథ. దీక్షా. పుట. 236.

అవాకుచవాకులు

 • అస్తవ్యస్తపు మాటలు. పనికిమాలిన మాటలు. జం.
 • "వదరుచు నున్నవా రుఱ కవాకు చవాకులు." గీర. లోకా. 12.
 • చూ. అవాకులు చవాకులు.

అవాకులు చవాకులు

 • "ఏవేవో అవాకులూ చవాకులూ నాలుగు వాగి పోయినాడు." వా.
 • చూ. అవాకుచవాకులు.

అవాఙ్మానసగోచరుడు

 • మాటకూ, మనసుకూ అందని వాడు-భగవంతుడు.
 • "యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ." అన్న వైదిక సూక్తిపై వచ్చినపలుకుబడి.

అవిచారితరమణీయము

 • చూ. ఆపాతరమణీయము.