పుట:PadabhamdhaParijathamu.djvu/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అవ_____అవ 98 అవ_____అవ

అవకతవక మనిషి

 • తెలివితక్కువ వాడు.

'*చూ. అవకతవక పని. అవఘళించు

 • ధిక్కరించు.
 • ఇది సామ్యమును దెలుపు మాట.
 • నైష. 1. 37.

అవతల చెంబు ఇవతల పెట్టదు (డు)

 • ఏపనీ చేయదు (డు).
 • "ఇవతల చెంబు అవతల పెట్టకుండా సంసారం ఎలా నడుస్తుంది." వా.

అవతల పుల్ల ఇవతల పెట్టదు (డు)

 • ఏపనీ చేయదు (డు) అనుట.
 • చూ. అవతల చెంబు....

అవతారం

 • వేషం.
 • నిరసనలో అనుమాట.
 • "ఏమిట్రా ఆ అవతారం. కాస్త మొహం కడుక్కొని బట్టలు మార్చుకుని రా." వా.
 • "వాడూ వాడి అవతారం చూస్తే వాంతి కొస్తుంది." వా.

అవతార మగు

 • పుట్టు.
 • "క్షీరవారాశిలో నవతార మయ్యెం, దార (యనుకన్యక)." హర. 6. 86.

అవతార మెత్తు

 • అవతరించు.
 • "ఎత్తితే యవతార మీ యుగమందు." పల. పు. 13.

అవదకాకి

 • పలుగాకి.
 • "కూర్చి చెట్ట బట్టుకొని తెచ్చె లోపలి కవదకాకి నారి యత్తలారి." పంచ. వేం. 1. 595.

అవదూఱు

 • చూ. అపదూఱు.

అవధారు

 • అవధరించు; విను డని పెద్దలతో చెప్పునప్పుడు అను మాట.
 • "తర్జిత భవ యవధా రవధారు." పండితా. ప్రథ. పురా. పుట. 376.

అవని దూరు

 • భయపడి పాఱిపోవు.
 • "కొండతో నెనవచ్చు ననవచ్చు నత డైన నవని దూరు." పాండు. 1. 74.

అవపథ్యము

 • ఔపథ్యము అన్నట్లు వాడుకలో వినబడుతుంది.
 • "అవపథ్యం చేయడంతో రోగం తిరగ బెట్టింది." వా.
 • చూ. అపథ్యము చేయు.

అవపాడి

 • అన్యాయము.
 • "అధికారిచయము దత్త, ద్విధముల నవపాడి చేసి వివిధనంబుల్..... అంతకంతకు జెఱిచెన్."
 • దశ. 11. 116.
 • చూ. అపపాడి.