పుట:PadabhamdhaParijathamu.djvu/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అల్లు_____అల్లు 97 అల్లు_____అవ

అల్లుగుఱ్ఱ

 • అల్లుడు.
 • "నీ యల్లుగుఱ్ఱ తనయుడు పుట్టెన్." భార. అశ్వ. 3. 169.

అల్లుడుకొమాళ్ళు

 • దొరతోపాటుగా ఉండే అంగ రక్షకులు.
 • బ్రౌను.

అల్లుతండము

 • విటుల మొత్తము.
 • వేశ్యామాతకు విటు లందరూ అల్లుళ్లే. దానిపై వచ్చిన పలుకుబడి.
 • "అల్లుతండంబుచే ధన మెల్ల గొనుచు." దశ. 5. 17.

అల్లుని మంచితనము

 • అరు దనుట.
 • "అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్యవిద్య......లేవు." సుమతి.

అల్లునేరేళ్లు

 • పిల్ల ల ఆటలు
 • "అవల వెన్నెలలో అల్లునేరే ళ్లింతె నివలి నిన్నటియునికి నేటికి గలదా?" తాళ్ల. సం. 5. 274.
 • చూ. అల్లోనేరేళ్లు.

అల్లుండ్రబూచి

 • వేశ్యామాత.
 • అల్లుండ్రపాలిటి దయ్యము.
 • "లోకముల కెల్ల నూచి యల్లుండ్ర బూచి." శుక. 3. 18.

అల్లు పొ ల్లెఱుగని

 • ఏమాత్రం కళంకం లేని.
 • "అల్లుపొ ల్లెఱుగని నా కులం బను మంచి, మడుగు జీరకు జాల మైల సోకె." ఉత్త. హరి. 5. 92.

అల్లెము తిను

 • మనుగుడుపులు గుడుచు.
 • "మా అల్లుడు అల్లెం తినడానికి వచ్చి ఉన్నాడు." వా.
 • "నీకేం రా అల్లెం తిన్న అల్లుడు లాగా ఉన్నావు." వా.
 • "వాడు అల్లెము తింటున్న అల్లుడు లాగా వాళ్లింట్లో మసులుతున్నాడు." వా.

అల్లోనేరేళ్లు

 • వెన్నెలలో ఆడుఆట.
 • ".....వెన్నెల దినమున నల్లోనేరేళ్ళు గాక యావల గలవే." రా. సుం. కాం. 181.
 • చూ. అల్లునేరేళ్లు.

అల్పాచమానం

 • మూత్రవిసర్జనం.
 • వైదిక పరిభాష.
 • "అల్పాచమానం చేసివస్తాను. కాసేపు క్షమించండి." వా.

అవకతవక

 • అస్తవ్యస్తపు - అర్థం లేని.
 • "ఇలాంటి అవకతవకపనులు చేస్తే గొంతుమీదికి వస్తుంది. జాగర్త." వా.

అవకతవక పని

 • తెలివితక్కువపని.
 • చూ. అవకతవకమనిషి.