పుట:PadabhamdhaParijathamu.djvu/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల____అల 93 అల____అలి

  • "....జవరదనము నలరుందే నెల్చిం దినగతి మాధుర్యము బొందుపడ ంవీణె ముట్టి పాలతుక పాడెన్." కళా. 2. 33.

అలరొందు

  • ఒప్పు.
  • "అది చూచి యలరొందు నగచర విభుని."
  • వర. రా. బా. పు. 18. పంక్త్ల్ 8.

అలవి కాదు

  • సాధ్యము కాదు.
  • రాయలసీమలో ఇది నేటికీ వాడుకలో ఉన్న మాట.
  • వ్యతిరేకార్థములో మాత్రమే యిది ప్రయుక్తమవుతుంది.
  • "బలహీను డైన వానికి నలవియె మోపెట్టి తెలియ నక్కార్ముకమున్." భార. ఆది. 7. 234
  • "వృత్రు ఘనబాహుబలం బలవికి మీఱెను." భార. ఉద్యో. 1. 125.
  • "చేరల గప్పుకో నలవి గామి జీదరం జెంది." పారి. 4. 14.
  • "నలినాయతాక్షి లేనడ లెంచ నంచవ య్యాళికత్తెకు నైన నలవి గాదు." శుక. 2. 7.
  • "వాడికి అలవిగాని పొగరు." వా.
  • చూ. అలివికాదు...

అ(లి)వి కాదు

  • సాధ్యము కాదు.<.big>
  • దేనినైనా తన చెప్పుచేతులలోనికి తీసుకొనగాదు.
  • ఇది వాడుకలో కూడ ఉన్నది. వాడు అలివి గాని మనిషి అని రాయలసీమలో వాడుక.
  • "అతన్ని పట్టడానికి అలివి కాదు."
  • "ఏ మనుకొన్నావో? వాడికి అలివి కాని కోపం." వా.
  • "ఆ తిరునాళ్లలో అలివిగాని జనం."

అలసి సొలసి

  • శ్రమపడి.
  • "అలసి సొలసి ప్రియంవద యంకపాలి." శకుం. 2. 228.

అలికి ముగ్గు పెట్టినట్లు

  • చక్కగా తీర్చినట్లు. లోపాలను కప్పిపుచ్చి అన్న సూచన కూడా యిందులో ఉంది.
  • "ఆవిడ మాట్లాడితే అలికి ముగ్గుపెట్టి నట్లుగా ఉంటుంది." వా.

అలికిడి చేయు

  • సంతానవతి యగు, గర్భిణి యగు.
  • "ఏమిరా! మనమరాలు ఏమైనా అలికిడి చేసిందా?" వా.

అలిగి తన్నిన పఱపు పయి పడినట్లు

  • చెడుపు చేయగా వానికి మంచి జరిగినట్లు.

"వెఱవకు కలలో జేసిన
కొఱగామికి వగచుచోట గుణరత్నము చే
కుఱె నీకు నలిగి తన్నిన
బఱపుపయిం బడినయట్లు పద్మదళాక్షి!"
                          ఉ. హరి. 5. 153.

పండితా. పూ. 387 పు.