పుట:PadabhamdhaParijathamu.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అఱ్ఱు_____అల 92 అల_____అల

అఱ్ఱు కఱ్ఱున బొడిచిన ట్లగు

  • మిక్కిలి బాధ కలుగు.
  • "కొట్టి కోలాహల మొనర్చి గోడు గుడిపి, రఱ్ఱు కఱ్ఱున బొడిచిన ట్లయ్యె బసికి." నాయకు. 43 పు.

అలంకారవిద్యార్థి

  • విద్యార్థి వేషమే కాని ఆజిజ్ఞాస లేనివాడు.
  • "వాడు వట్టి అలంకారవిద్యార్థి. వాడికి చదు వేం వచ్చు? వేషం మాత్రమే." వా.

అలంగం తిరగడం

  • స్వేచ్ఛగా తిరగడం.
  • నిరసనగా అనుమాట.

అలక పాన్పు

  • పెండ్లిలో జరిపే ఒక సాంగెం. మంచం పడక వేసి, దాని మీద నూతనవధూవరులను కూర్చుండబెట్టి, దంపతి తాంబూలాలూ అవీ ఇప్పించడం కూడా ఇందులోని భాగమే. అప్పుడు అల్లుడు కోరిన యే కోరిక నయినా మామగారు తీర్చడం విధి. అది తీర్చే దాకా అల్లుడు అలకపట్టి ఉంటాడు.
  • "ఆ అల్లుడు అలకపాన్పుమీద రేడియోకొని మ్మని అడిగా డట." వా.

అలగాజనం

  • చిల్లరిజనం.
  • కొత్త. 315.

అలజడి

  • ఆందోళన.

అలజడివెట్టు

  • తొందరపెట్టు.
  • "అప్పిచ్చిన వారలు మా, యప్పులు పెట్టు మని చాల నలజెడి వెట్టన్." రుక్మాం. 4. 110.
  • చూ. అడజడిపెట్టు.

అలబలము

  • కలకలము.
  • "అలబలముతోడ మృగ యు లరిగిరి వెంటన్." సారం. 1. 85.

అలబలము సేయు

  • అల్లరి చేయు. కలకలధ్వనులు చేయు.
  • "అల బలము లసంఖ్యము లై, యలబలములు సేయుచుండ..." విజయ. 3. 140.
  • "అలబలము సేయు శుక శారికల నదల్చి." విప్ర. 2. 56.

అలమారుచు

  • బండి యెద్దులలో వలపటి దానిని దాపటికీ, దాపటి దానిని వలపటికీ మార్చి కట్టు.

అలరమ్ములు

  • పుష్ప బాణములు.
  • "అలిగి విరహుల నలరమ్ము లాడ నేసి." కుమా. 9. 124.

అలరుతేనెలు చిందు

  • మాధుర్యము లొలుకు.