పుట:PadabhamdhaParijathamu.djvu/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అఱి_____అఱ్ఱా 91 అఱ్ఱా_____అఱ్ఱా

అఱిమెనకుండలు

  • అయిరేని కుండలు.
  • పెండ్లిండ్లలో కొన్ని వర్గాలలో ముందుగా ఉల్లెడ పట్టుకొని మేళతాళాలతో వెళ్ళి కుమ్మరియింటినుండి అలివేణి కుండలు తెస్తారు. వీటికే రూపాంతరాలు అఱివెణ కుండలు, అలివేణి కుండలు, అవిరేని కుండలు, అయిరేని కుండలు. వీటిపై రంగులతో చిత్రించడం కద్దు.

అఱివెణకుండలు

  • చూ. అఱిమెన కుండలు.

అఱుగ్రమ్ము

  • పై బడు, కవియు.
  • "అఱుగ్రమ్మి మఱియు ని ట్లనిరి నరేంద్ర గిఱిగొన్న ప్రేమ భోగినుల గామంబు."
  • గౌ. హరి. ప్రథ. పంక్తి. 966.
  • "పఱచు నెత్తురుటేర్లు బహుమాంస ములకు, నఱు గ్రమ్ము భూతంబు లై రణం బొప్పె."
  • రంగ. రామా. సుం. 265 పు

అఱుదెవులు

  • క్షయ.

అఱ్ఱాక యిడు

  • ఆటంక పెట్టు.
  • చూ. అఱ్ఱాకల బెట్టు.

"ఆకొని యఱచెడు ప్రేవులు
నేకట వో నమలవలయు నీమాంసము న
ఱ్ఱాక యిడి యివ్విధంబున
దేకువ చెడి పల్క నగునె ధేనువు నాతోన్." భోజ.

అఱ్ఱాకల బెట్టు

  • బాధపెట్టు.

"నీ వాకొన్నాడవు భోజనోత్తరమునం
దాస్తాన మై యుండ న, ఱ్ఱాకం బెట్టక
 చెప్పెదన్ సకలవృత్తాంతంబునున్." కాశీ. 7. 174.

  • "ప్రసూనబాణు డఱ్ఱాకల బెట్టి దా

నఱవ నావెలబాలికకై విటావళిన్." కళా. 1. 133.

  • "......సాకగదే నన్నిపుడ

ఱ్ఱాకల బెట్టక పలాశనాసక్తుడ వై." కా. మా. 3 ఆ. 89 ప.

అఱ్ఱాకలి సేయు

  • కడుపు నిండా పెట్టక బాధ పెట్టు.
  • నేడు అర్ధాకలి అరకడుపు అనే మాటలతోనే యిది కనపడుతుంది.
  • "అఱ్ఱాకలి సేయకుము." భోజ. 6. 165.
  • చూ. అర్ధాకలి.

అఱ్ఱాడు

  • ఉత్కంఠ గొను; ఆశతో చుట్టుముట్టుల తిరుగు.
  • "ఒక్క వేదండస్వామి మదంబు సేసె గరిణీధామంబు లఱ్ఱాడగాన్."కుమా. 1. 86.
  • "చిగురు జొంపములందు దగిలి యఱ్ఱాడుచు గెరలు కోయిల సుస్వరములకును." మార్కం. 5. 7.
  • "ఇబ్బాలకులు మన వాలకపు సొమ్ము లందు నేమేనియు నపహరించుటకు నఱ్ఱాడుచున్నవారు. మీరలీ మ్రుచ్చుల నెచ్చరికం గనుపెట్టుకొని యుండుడు..." ప్రభా. 1. 107.