పుట:PadabhamdhaParijathamu.djvu/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అఱ_____అఱ

90

అఱ_____అఱ


  • "శిష్టాన్న భోజనపరు లగు పుణ్యులకుం

బుణ్యలోకంబు లఱచేతిలోనివి గావె."

  • భార. శాంతి. 1. 72.

అఱచేతు లొగ్గు

  • చూ. అఱచేతిది.
  • అఱచేతు లడ్డముగా పెట్టు.
  • ఉత్త. 6. 138.

అఱచేయు

  • మన:పూర్వకంగా కాక యేదో పట్టీ పట్టనట్లు చేయు.
  • "అఱచేసిన దోషము వచ్చు."
  • భోజ. 4. 38.

అఱజాతి

  • నీచుడు.
  • కులహీను డనుటపై వచ్చిన పలుకుబడి.
  • "నీపను లఱజాతివి." హరి. పూ. 5. 24.
  • "ప్రల్లదు డఱజాతి భక్తిహీనుండు." బసవ. 1 ఆ.

అఱ తలనొప్పి

  • ఒంటిపార్శ్వం నొప్పి.
  • తల ఒకవేపే నొప్పి ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం దాకా పెరుగుతూ వస్తుంది. ఇది ఆరంభ మయితే చాలా కాలం ఉండడం, విపరీతంగా బాధించడం అలవాటు.
  • "పొద్దు న్నే సూర్యోదయం కాక ముందే పెరుగన్నం తింటే మూడురోజులలోనే అరతలనొప్పి మాయమై పోతుంది." వా.

అఱపులకు నేర్పరి

  • మాటలలో గట్టివాడు, క్రియలో నేర్పరి కాదన్న సూచన ఇందులో ఉన్నది.
  • "నిను నెఱుగమె యఱపులకును నేర్పరి వని....." కళా. 7. 22.

అఱపొఱడు

  • గూనివాడు.

అఱమపాఱుడు

  • కపటబ్రాహ్మణుడు.
  • "అఱమపాఱుండు ప్రక్కలు విఱుగ నగుచు." కుమా. 7. 19.

అఱలేని కూర్మి

  • అఱకొఱ లేనిప్రేమ.
  • "ధవు డఱ లేనికూర్మి జవదాటక నీపలు కాదరింపగా." పారి. 1. 62.

అఱవచాకిరి

  • గొడ్డుచాకిరి.
  • "ఎవరు చేస్తారు రా వాళ్ళింట్లో అరవచాకిరీ." వా.

అఱవయేడుపు

  • దొంగయేడుపు.
  • "ఈ అఱవయేడుపులు ఏడిస్తే నేను మోసపోయేవాణ్ణి కాదు తెలుసుకో." వా.

అఱసేయక

  • వెనుదీయక-మనసులో దాచు కొనక.
  • "నీకు నఱసేయక సెప్పెద." కాశీ. 6. 267.